Begin typing your search above and press return to search.
జెనీలియాకి మరో బాబు పుట్టాడు
By: Tupaki Desk | 1 Jun 2016 5:38 AM GMTకథానాయిక జెనీలియా మరో పండంటి బాబుకి జన్మనిచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఆ విషయాన్ని జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వెల్లడించాడు. ఈ దంపతులకి ఇప్పటికే రియాన్ అనే నాలుగేళ్ల బాబు ఉన్నాడు. రియాన్‌కి తోడుగా ఇప్పుడు మరో బుడ్డోడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడన్నమాట. సినిమాలో నటిస్తున్నప్పుడే ఒకరినొకరు ప్రేమించుకొన్న జెనీలియా - రితేశ్ ఆ తర్వాత పదేళ్లకి పెళ్లి చేసుకొన్నారు.
ఇద్దరిదీ ఎంతో అన్యోన్యమైన జంట. మరో బాబు పుట్టడంతో జెనీలియా - రితేశ్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. మా అర్హత కంటే ఎక్కువగానే ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు అంటూ నిన్ననే ట్వీట్ చేసింది జెనీలియా. బేబీ బంప్ తో జెనీలియా - రితేశ్ దంపతులు తీపి గుర్తుగా కొన్ని ఫొటోలు తీయించుకొన్నారు. వాటిని నిన్నరాత్రే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది జెనీలియా. ఈరోజు రితేశ్ దేశ్‌ముఖ్ తన పెద్ద కొడుకు రియాన్ ఫొటో పెట్టి ఇప్పుడు నా ఆట బొమ్మలన్నీ మా తమ్ముడివే అంటూ కామెంట్ పెట్టారు. ఈ దంపతులకి మరో బాబు పుట్టాడన్న విషయం తెలుసుకొన్న బాలీవుడ్ సెలెబ్రిటీలు - స్నేహితులు కంగ్రాట్స్ చెబుతున్నారు.