Begin typing your search above and press return to search.

అప్పుడే మూడో పెళ్ళాం వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 July 2015 1:04 PM IST
అప్పుడే మూడో పెళ్ళాం వచ్చేసింది
X
బాలీవుడ్‌ లో 'మస్తీ' సిరీస్‌ మస్త్‌ అంటూ కితాబిచ్చింది యువతరం. అందుకే ఈ సిరీస్‌ లో మస్తీ, గ్రాండ్‌ మస్తీ రిలీజై సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు కొనసాగింపుగా 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' తెరకెక్కుతోంది. ఇందులో మునుపటి లానే అడల్ట్‌ కామెడీ పీక్స్‌ లో ఉంటుందని చెబుతున్నారు.

ఇందులో రితేష్‌ దేశ్‌ ముఖ్‌, ఆఫ్తాబ్‌ శివదాసాని, వివేక్‌ ఒబేరాయ్‌ కథానాయకులు. ఈ ముగ్గురికి భార్యలు ఉంటారు. భార్యామణులతో అడల్ట్‌ కామెడీ చేసే మొగుళ్లు గా కనిపిస్తారు వీళ్లంతా. అయితే ఆఫ్తాబ్‌, వివేక్‌ ఇద్దరికీ భార్య పాత్రల్ని ఈజీగానే ఎంపిక చేయగలిగారు కానీ, రితేష్‌కి భార్యని వెతకడం దర్శకనిర్మాతలకు తలనొప్పి వ్యవహారం అయిపోయింది. ఇప్పటికే ఇద్దరు భార్యల్ని మార్చేశారు. నిధి సుబ్బయ్య, పూజా చోప్రా ఈ ఇద్దరి తో ఇప్పటికే కొంత ఫిలిం షూట్‌ చేసినా భార్యలుగా అన్‌ ఫిట్‌ అంటూ ఆ ఇద్దరినీ తొలగించారు. ఇప్పుడు ఆ ప్లేస్‌ లోకి దేవోంకే దేవ్‌ మహదేవ్‌.. టెలీ సీరియల్‌ లో పార్వతి పాత్ర లో నటించిన పూజా బెనర్జీ ఎంపికైంది.

పూజా ఇప్పటికే బాలీవుడ్‌ లో ఫేమస్‌ పర్సనాలిటీ. వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటోంది. రితేష్‌ తో మస్తీ చేయడానికి రెడీ అవుతోంది. ఇక భార్య పాత్రధారిని మార్చాల్సిన పనే లేకుండా చేస్తుందేమో చూడాలి.