Begin typing your search above and press return to search.

షాకింగ్‌..అభిమాని కాళ్లు ప‌ట్టుకున్న హీరో!

By:  Tupaki Desk   |   4 Dec 2022 3:30 AM GMT
షాకింగ్‌..అభిమాని కాళ్లు ప‌ట్టుకున్న హీరో!
X
సినీ స్టార్స్ ని అభిమానులు డెమీ గాడ్స్ గా చూస్తుంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా.. ఎలాంటి ప్ర‌మాద‌క‌ర విన్యాసానికైనా వెనుకాడ‌రు. త‌మ‌కు న‌చ్చిన స్టార్ ని ప్ర‌స‌న్నం చేసుకుని వారి దృష్టిలో ప‌డాల‌ని ప్ర‌య‌త్నించ‌ని అభిమాని అభిమాని అంటూ ఎవ‌రూ వుండ‌రు. అంత‌గా న‌చ్చిన స్టార్స్ కోసం ప్రాణం పెడుతుంటారు. వారి ప‌నులు చూసి స్టార్స్ కూడా ముచ్చ‌ట‌ప‌డుతూ వారిన అక్కున చేర్చుకుని త‌మ కుటుంబ స‌భ్యుడిగా ట్రీట్ చేస్తున్న సంద‌ర్భాలు చాలా వున్నాయి.

తెలుగు స్టార్స్, త‌మిళ స్టార్స్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ద‌క్షిణాది, ఉత్త‌రాది హీరోలు త‌మ అభిమానుల కోసం స్టేజ్ దిగి వారితో క‌లిసి సెల్ఫీల‌కు పోజులివ్వ‌డం.. వారిని ఆనంద‌ప‌ర‌చ‌య‌డం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌టం చూస్తున్నాం. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ హీరో ఏకంగా ఓ లేడీ అభిమాని కాళ్లు ప‌ట్టుకోవ‌డం.. ఆమె కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే... విభిన్న‌మైన సినిమాలతో హీరోగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌.

జెనీలియాని వివాహం చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రైన రితేష్ దేశ్ ముఖ్ తొలిసారి మ‌రాఠీలో `వేద్‌` మూవీలో న‌టిస్తూ తానే స్వ‌యంగా తెర‌కెక్కిస్తున్నాడు. రితేష్ డైరెక్ట్ చేస్తున్న తొలి మూవీ ఇది. తెలుగులో నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించగా శివ నిర్వాణ తెర‌కెక్కించిన `మ‌జిలి` మూవీకిది రీమేక్‌. ఇందులో జెనీలియా హీరోయిన్ గా రితేష్ దేశ్ ముఖ్ కు జోడీగా న‌టిస్తోంది. చాలా కాలం త‌రువాత భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది.

రొమాంటిక్ ఫ్యామిలీ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాని డిసెంబ‌ర్ 30న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రితేష్ దేశ్ ముఖ్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించాడు. ప్ర‌తీ అంశాన్ని ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం వాడేస్తున్నాడు రితేష్‌. ఈ నేప‌థ్యంలోనే ఓ కాలేజీ క్యాంప‌స్ లో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించాడు. ఓ అమ్మాయి స్టేజ్ పైకి వ‌చ్చేసి రితేష్ కు ఓ ఆల్బ‌మ్ ని అందించింది. త‌న‌పై వున్న అభిమానాన్ని చాటుకుంది. ఆ త‌రువాత త‌న‌తో క‌లిసి డ్యాన్స్ చేయాల‌ని రితేష్ ని కోర‌డంతో త‌న‌తో క‌లిసి డ్యాన్స్ చేశాడు.

ఊహించ‌ని అనుభ‌వం ఎదుర‌వ్వ‌డంతో స‌ద‌రు యువ‌తి భావోద్వేగానికి లోనై బోరున ఏడ్చేసింది. వెంట‌నే రితేష్ పాదాల‌ని తాకింది. ఆ వెంట‌నే అభిమాని పాదాల‌ని రితేష్ తాక‌డంతో అక్క‌డున్న స్టూడెంట్స్ అంతా అత‌ని బిమేవియ‌ర్ కు ఫిదా అయిపోయారు. ఈ సంఘ‌న‌ట‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.