Begin typing your search above and press return to search.
డబ్బులు గురించి జెన్నీకే బాగా తెలుసు
By: Tupaki Desk | 24 May 2016 1:30 PM GMTఇప్పుడు ఒక టాపిక్ గురించి మన టాలీవుడ్ నిర్మాతలు అండ్ ప్రొడక్షన్ మేనేజర్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. నా సినిమాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే కాదు.. డే టు డే షూటింగ్ లో కూడా నా భార్య జెనీలియా అన్ని లెక్కలూ బాగా చూసుకుంటుంది అంటూ ఆమె భర్త.. హీరో రితేష్ దేశ్ ముఖ్ చెప్పుకొచ్చాడు. దీనిపైనే ఇప్పుడు మాంచి కామెడీ నడుస్తోంది.
అప్పట్లో జెనీలియా అండ్ ఆమె మథర్ తన దగ్గర డబ్బులు గుంజేశారని.. వారి కారణంగానే ఈ సినిమాకు చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చిందని.. మెగా బ్రదర్ నాగబాబు ''ఆరెంజ్'' డిజాష్టర్ రిజల్టు టైములో కామెంట్లు చేశారు. ఆ టైమ్ లో వినిపించిన న్యూస్ ఏంటంటే.. అమ్మడు తన వాటర్ బాటిల్ బిల్లుతో సహా నిర్మాత దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తుందట. ఫారిన్ వస్తే పాకెట్ మనీ.. ఒక్కరోజు లేటైనా కూడా ఎక్సట్రా డేట్ కోసం ఎక్సట్రా బిల్లు.. ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఎడిషనల్ ఖర్చులు.. ఇలా నిర్మాతలను ఊపిరి తీసుకోకుండా వసూలు చేస్తుందట. అలాగే ఏదైనా రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ లకు వచ్చినా కూడా.. అసలు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ కంటే.. జెనీలియాను సాగనంపే టైముకు తడసి మోపెడవుతుంది చాలామంది పి.ఆర్.లు కూడా చెప్పేవారు. అందుకే ఆరెంజ్ సినిమా తరువాత అమ్మడు టాలీవుడ్ లో కనుమరుగైపోయింది.
ఇక చెప్పొచ్చేదంటంటే.. నిర్మాతల దగ్గర ఆ రేంజులో పిండేసిన జెనీలియాకు.. మరి ఖర్చులు ఎలా పెట్టాలో కూడా తెలుస్తుందిగా. అందుకే రితేశ్ తాలూకు నిర్మాణ సారధ్యానికి అమ్మడికంటే బెటర్ మేనేజర్ ఎవరు దొరుకుతారు.