Begin typing your search above and press return to search.

15 ఏళ్లు గడిచినా.. తలుస్తూనే ఉన్నాడే

By:  Tupaki Desk   |   5 Jan 2018 1:30 AM GMT
15 ఏళ్లు గడిచినా.. తలుస్తూనే ఉన్నాడే
X
సినిమాలలో జంటగా నటించిన వ్యక్తులు.. రియల్ లైఫ్ లోను జోడీ కట్టేయడం కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని బ్రేకప్ లు కూడా ఉన్నా.. ఎంచక్కా కాపురం చేసుకుంటున్న వారు కూడా బోలెడంత మంది ఉన్నారు. వీరిలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్.. తెలుగు నుంచి హిందీకి ఎగిరిన జెనీలియా జోడీని కూడా చెప్పుకోవాలి.

తాజాగా రితేష్ ఓ చక్కని ట్వీట్ పెట్టాడు. ఈ హీరో నటించిన తొలి చిత్రం తుఝే మేరీ కసమ్ రిలీజ్ అయ్యి.. ఇవాల్టితో(జనవరి3) 15 సంవత్సరాలు గడించాయి. '3 జనవరి 2003.. 15 ఏళ్ల క్రితం తుఝే మేరీ కసమ్ రిలీజ్ అయింది. తొలి సినిమా కావడంతో లైఫ్ మారిపోయింది. ఓ ఆర్కిటెక్ట్.. యాక్టర్ గా మారిపోయాడు. జోడీగా నటించిన జెనీలియా డిసౌజా.. లైఫ్ పార్ట్నర్ అయిపోయింది' అంటూ రితేష్ దేశ్ ముఖ్ పెట్టిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లయి 15 ఏళ్లు గడిచిపోయినా.. తొలి సినిమాతో పాటు.. తన ప్రేయసి కం జీవిత భాగస్వామి గురించి ఈ హీరో చెప్పిన తీరుకు సూపర్ అనాల్సిందే.

15 ఏళ్ల క్రితం తుఝే మేరీ కసమ్ చిత్రంతో సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చాడు రితేష్ దేశ్ ముఖ్. మలయాళ మూవీ నీరమ్ కు ఇది రీమేక్. ఇదే చిత్రం ఆధారంగానే తెలుగులో నువ్వేకావాలి చిత్రం రూపొందింది. తెలుగు మాదిరిగానే.. హిందీలో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో.. హీరోగా సెటిల్ అయిపోయాడు రితేష్ దేశ్ ముఖ్.