Begin typing your search above and press return to search.
బాక్సింగే ఈజీ అంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 11 April 2017 8:11 AM GMTబాక్సింగ్ అంటే ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. ప్రత్యర్థులతో తలపడాలి. బోలెడన్ని దెబ్బలు తినాలి. ఎంతో సాధన చేయాలి. కానీ సినిమా నటి అయితే ఉండే లగ్జరీనే వేరు. కారవాన్లలో ఉంటూ.. మధ్య మధ్యలో వచ్చి ఒక సీన్ చేసి వెళ్లిపోతే చాలు. కానీ తనకు మాత్రం నటన కంటే బాక్సింగే ఈజీ అంటోంది ‘గురు’ హీరోయిన్ రితికా సింగ్. బాక్సింగ్.. యాక్టింగ్ ఈ రెండింట్లో ఏది ఈజీ అంటే మాత్రం ‘బాక్సింగ్’కే ఓటేస్తానని ఆమె అంటోంది. ‘‘కిక్ బాక్సింగ్ కంటే నటనే కష్టం. నేను మూడేళ్ల వయసు నుంచి బాక్సింగ్ చేస్తున్నాను. కాబట్టి అది నాకు కష్టంగా ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఉన్నట్టుండి అస్సలు పరిచయం లేని ఫీల్డులోకి వచ్చి.. సినిమాల్లోకి వచ్చి నటించడమంటే కష్టంగా అనిపిస్తోంది’’ అని రితిక తెలిపింది.
మార్షల్ ఆర్ట్స్ లో.. బాక్సింగ్ లో శిక్షణ పొంది.. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్న రితికా.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ‘గురు’ మాతృక ‘ఇరుదు సుట్రు’లో నటించడానికి కొన్ని నెలల ముందు కూడా ఆమె ముంబయిలో సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొంటున్నపుడే మాధవన్ దృష్టి ఆమెపై పడి ‘ఇరుదు సుట్రు’లో అవకాశం దక్కిందట. ‘‘నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఒక మ్యాచ్ ఆడుతుంటే మాధవన్ గారు ఆ మ్యాచ్ చూడడానికి వచ్చారు. అయన నన్ను బాగా గమనించి మ్యాచ్ తర్వాత మా నాన్నకు ఫోన్ చేసి ఇలా మా సినిమాకు మీ అమ్మాయి అయితే బాగుంటుందని అడిగారు. ఆ తర్వాత నేను కూడా ఆడిషన్స్ కు వెళ్లడం.. వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగాయి’’ అని రితికా చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన కొత్త సినిమా ‘శివలింగ’ తమిళ.. తెలుగు భాషల్లో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/