Begin typing your search above and press return to search.
'టక్ జగదీష్' రియలిస్టిక్ గా ఉంటుంది.. ఓవర్ యాక్షన్ సీన్లు ఉండవు: రీతూ వర్మ
By: Tupaki Desk | 8 Sep 2021 10:52 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. ఐశ్వర్యా రాజేష్ కీలక పాత్ర పోషించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ మీడియాతో ముచ్చటించారు.
- ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లోకెల్లా 'టక్ జగదీష్' ప్రత్యేకం. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారి అయిన గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్ గా తన అధికారాన్ని చూపించే పాత్ర అది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయి. ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి.. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్ర.
- ఇది కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్ లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్ మాత్రం మిస్ అవుతాం. ఇప్పుడు ఓటీటీ కూడా మంచి ఫామ్ లో ఉంది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ మీద మనం ఆధారపడ్డాం. అదే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో 'టక్ జగదీష్' సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది.
- సాధారణంగా సిటీ అమ్మాయిని. ఎప్పుడూ కూడా గ్రామాల్లోకి వెళ్లలేదు.. ఉండలేదు. కానీ నేను మనుషులను ఎక్కువగా గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం శివ నిర్వాణ గారే ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆ పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్ ధరించగానే పాత్రలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.
- 'ఎవడే సుబ్రహ్మణ్యం' తర్వాత నానితో చేస్తున్న రెండో సినిమా ఇది. అందులో నాది చిన్న పాత్ర.. అంతగా ఇంటరాక్షన్ అవ్వలేదు. అందులోనూ నేను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఈసారి మాత్రం నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఎంతో నేర్చుకున్నాను. సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఆయనెంతో సపోర్ట్ చేశారు.
- నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో నానికి, 'టక్ జగదీష్' చిత్రంలో నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన అంటే ఇష్టం.. ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది.
- 'టక్ జగదీష్' కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్ గా ఉంటుంది. ఓవర్ యాక్షన్ - డ్రామా సీన్లు ఉండవు. సటిల్ యాక్షన్ ఉంటుంది. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. యూనిక్ గా ఉంటుంది. కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
- శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. 'నిన్నుకోరి' 'మజిలి' సినిమాలు చూసినప్పుడు శివ నిర్వాణ గారితో పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.
- 'టక్ జగదీష్' లో కామెడీ కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నానికి, నాకు ఉన్న సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. 'టక్ జగదీష్' తరువాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ మూవీతో ఓ వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్ - మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతాను.
- ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను. కథలో నా పాత్ర బలంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అంతే కానీ నేను ఫలానా పాత్రలను చేయను అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్దంగానే ఉన్నాను.
- 'వరుడు కావలెను' అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం 'ఒకే ఒక జీవితం'. మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం, ఎంజాయ్ చేసే పాత్రలను పోషించడం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కువగా అలాంటి అవకాశాలు రాలేదు. 'వరుడు కావలెను' లో అలాంటి అవకాశం వచ్చింది.
- ప్రస్తుతానికి అయితే నటన మీదే దృష్టి పెట్టాను. కానీ నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను.
- 'పెళ్లి చూపులు' సినిమాతో కోలీవుడ్ కూడా నాకు మంచి స్వాగతం పలికింది. అక్కడ అంతా బాగానే ఉంది. 'ధృవ నక్షత్రం', 'కనులు కనులు దోచాయంటే' సినిమాలకు తమిళంలో డబ్ చెప్పాను. కానీ హిందీ యాక్సంట్ ఉందని వద్దన్నారు. కానీ తెలుగులో మాత్రం నేనే చెప్పుకుంటాను.
- ఇప్పుడు ఆ భాష ఈ భాష అనే హద్దులు లేవు. ఇప్పుడు ఇండియన్ సినిమా అని చూస్తున్నారు. మనం కూడా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నాం. ఇక్కడి సినిమాలను బాలీవుడ్ కూడా రీమేక్స్ చేస్తోంది. అక్కడ మంచి అవకాశాలు వస్తే చేస్తాను.
- లాక్ డౌన్ వల్ల దాదాపు నాలుగైదు నెలలు పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాం. నేను సాధారణంగానే పనిని ఆరాధిస్తాను.. గౌరవిస్తాను. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే మనం ఈ రోజు మన వారితో సంతోషంగా ఉండాలని లాక్ డౌన్ లో నేర్చుకున్నాను.