Begin typing your search above and press return to search.
పెళ్లికి నాలుగేళ్లు ఆగమంటున్న రీతూ
By: Tupaki Desk | 27 Oct 2021 9:50 AM GMTహైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. `బాద్ షా` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రీతూకి అటుపై `పెళ్లి చూపులు` సోలో విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కింది. నటిగానూ రీతూ నిరూపించుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ లోనూ బాగానే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ సాపీగానే సాగిపోతుంది. మీడియం బడ్జెట్ చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంది. తాజాగా అమ్మడు నటించిన `వరుడు కావలెను` సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వరుసగా పెళ్లి నేపథ్యం..ఆ తరహా టైటిల్స్ ఉన్న చిత్రాల్లో రీతూ నటిస్తున్నారు. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అని అడిగితే మాత్రం తననుంచి సమాధానం షాకిస్తోంది.
పెళ్లిని వాయిదా వేస్తూ సమాధానం చెప్పింది. ``ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు లక్కీగా ఇంటి నుంచి ఒత్తడి తీసుకొచ్చే వాళ్లు కూడా లేరు. అమ్మనాన్న నన్ను అర్ధం చేసుకుంటారు. వాళ్ల నుంచి ఎలాంటి సమస్యా లేదు. పెళ్లి చేసుకోవాలని ఇప్పటివరకూ పట్టుబట్టలేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా అది జరుగుతుంది. అలాంటప్పుడు ముందుగా ఆరాటపడటం దేనికి? అంటూ బదులిచ్చారు. కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నా. అప్పటివరకూ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి నేపథ్యం ఉన్న కథల్ని నాకు నేనుగా ఎంచుకున్నవి కాదు. అవే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి`` అని తెలిపారు
`పెళ్లిచూపులు`..`వరుడు కావలెను` వాటికవి అలా జరిగిపోయాయి. ఈ సినిమాల్లో నటిస్తానని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ వృత్తి కాబట్టి వచ్చిన వాటిలో నటించాలి. వరుడు కావలెను చిత్రంలో మంచి పాత్ర పోషించాను. అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. కనీసం ఎవరితోనైనా రిలేషన్ లో ఏమైనా ఉన్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రీతూ ఖండించారు. `వరుడు కావలెను` చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అక్టోబర్ 29న సినిమా రిలీజ్ అవుతుంది.