Begin typing your search above and press return to search.

పెళ్ళి చూపులు పిల్ల ఏమంటోందంటే

By:  Tupaki Desk   |   7 March 2018 2:30 AM GMT
పెళ్ళి చూపులు పిల్ల ఏమంటోందంటే
X
సినిమా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెం తెలివి కూడా ఉండాలని పెళ్లి చూపులు భామ బాగానే నిరూపిస్తోంది. టాలీవుడ్ లో చిన్న తరహా హీరోలతో వర్క్ చేసి మంచి హిట్స్ అందుకున్న రీతూ వర్మ ఇప్పుడు ఇతర భాషల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటోంది. రీతూ మన తెలుగమ్మాయే అయినా ఇతర భాషలపై పట్టుంది. ఏదైనా ఆడిషన్ కి వెళ్లిందంటే చాలు మొదటి చూపులోనే తన టాలెంట్ తో దర్శకుడిని ఆకట్టుకుంటుందట.

ఇక కోలీవుడ్ లో కూడా రీతూ ఇప్పుడు చాలా బిజీ అయ్యింది. స్టార్ హీరో విక్రమ్ చేస్తోన్న ధృవ నచ్చతిరాం సినిమాలో ఈ భామ నటిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ హీరో గురించి కొన్ని విషయాలను చెప్పింది. రీతూ మాట్లాడుతూ.. విక్రమ్ గారు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మన ఎదురుగా ఉంటే ఆ హోదాని ఏ మాత్రం చూపించారు. ఎక్కువగా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే.. ఆయన ఆలోచన మొత్తం సిన్ పైనే ఉంటుంది.

షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కష్టపడతారు. ఏ మాత్రం నిరుత్సాహపడరు. దర్శకుడు గౌతమ్ మీనన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ చేస్తోన్న సినిమాలో కూడా నటిస్తున్నా. అందులో కూడా నా పాత్ర చాలా బావుంటుంది. తమిళ్ బాషా నాకు వచ్చు కాబట్టి వర్క్ తేలికవుతోంది. భాషలతో నాకు సంబంధంలేదు. కథ బావుంటే ఏ భాషలో అయినా నటిస్తా. కేవలం సినిమా కథకు తగ్గటుగా ఇచ్చిన పాత్రకు న్యాయం చేయాలన్నదే నా కోరిక అని రీతూ వివరించింది.