Begin typing your search above and press return to search.

జగదీష్ లవర్‌ కొత్త ప్రయోగం

By:  Tupaki Desk   |   10 Sep 2021 6:41 AM GMT
జగదీష్ లవర్‌ కొత్త ప్రయోగం
X
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రీతూ వర్మ షార్ట్‌ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా పేరు దక్కించుకుని టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో వరుస సినిమాలతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ రీతూ వర్మ తాజాగా తెలుగులో టక్‌ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానికి జోడీగా ఈమె నటించిన టక్ జగదీష్‌ అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాలో రీతూ వర్మ నటన మరియు లుక్స్‌ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పద్దతైన చీర కట్టులో పల్లెటూరు అందమైన అమ్మాయిగా కనిపించి మెప్పించింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగినా కూడా ఈమె నార్త్‌ అమ్మాయి అన్నట్లుగా ఉంటుంది. కారణం ఈమె కుటుంబ మూలాలు నార్త్‌ లో ఉన్నాయి. అందువల్ల తన ఇంట్లో సౌత్‌ మరియు నార్త్‌ కల్చర్ మిక్స్ అయ్యి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

ఇప్పటి వరకు ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా పద్దతైన పాత్రల్లోనే హుందా డ్రస్సింగ్‌ లో కనిపించింది. కాని మొదటి సారి ఈమెకు బోల్డ్ పాత్రలో నటించేందుకు కూడా సిద్దం అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చింది. ఈమె ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాల్లో ఈమెకు పాత్రలు వస్తున్నాయి. ఆ ఇమేజ్ నుండి బయట పడటం కోసం ఈ అమ్మడు ఓ వెబ్‌ సిరీస్‌ లో నటించాలని.. అందులో కాస్త హాట్ గా బోల్డ్ గా కనిపించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు అమెజాన్ కోసం ఒక వెబ్‌ సిరీస్ ను చేయబోతుంది. ఆ వెబ్‌ సిరీస్‌ త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవ్వబోతుంది.

వెబ్‌ సిరీస్ ల్లో అంటే కాస్త అందాల ప్రదర్శణ చేయాలి కదా.. మీరు అందుకు సిద్దమేనా అంటూ ప్రశ్నించిన సమయంలో రీతూ వర్మ నుండి వచ్చిన సమాధానం ముందు ముందు ఆమె అందాల ప్రదర్శణ విషయంలో హద్దులు దాటేలా ఉంది అనిపించక మానదు. గ్లామర్ గా నటించడంకు నేను ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. నన్ను గ్లామర్ గా చూపించే ఆఫర్లు ఇప్పటి వరకు నాకు రాలేదు. అంతే తప్ప నేను గ్లామర్ రోల్స్ వస్తే వద్దన్నది లేదు అంటూ అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నాను. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు వెబ్‌ సిరీస్ లు ఎప్పుడు కూడా చేసేందుకు సిద్దంగా ఉంటాను.

పాత్రల విషయంలో గ్లామర్‌ షో విషయంలో తాను గిరి గీసుకుని ఉండేదాన్ని కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. సినిమాల్లో ఇప్పటికే ఈమెకు ఒక బ్రాండ్‌ ఏర్పడింది. కనుక అమెజాన్ లో వెబ్‌ సిరీస్ ద్వారా కొత్త ప్రయోగం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉంది. వెబ్‌ సిరీస్ ప్రయోగం కనుక సఫలం అయితే ఖచ్చితంగా ఈ అమ్మడి కెరీర్‌ లో గ్లామర్‌ రోల్స్ పడటం ఖాయం. స్టార్‌ హీరోల సినిమాల్లో గ్లామర్‌ రోల్స్ పడితే స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరడం ఖాయం. రీతూ వర్మకు ఆ అవకాశం దక్కేనా.. గ్లామర్ గా ఈ అమ్మడిని సినిమాల్లో చూడబోతున్నామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది