Begin typing your search above and press return to search.

కావేరిపై కమల్ ఘాటైన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   15 Sep 2016 4:28 AM GMT
కావేరిపై కమల్ ఘాటైన వ్యాఖ్యలు!
X
రెండు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసిన కావేరి జల వివాదం చేసిన రచ్చ, సృష్టించిన దారుణాలు, కల్గించిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో 144సెక్షన్లు, కర్ఫ్యూలు విదించినా కూడా అక్కడక్కడా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయి. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త చల్లబడింది.. చక్కబడింది. ఈ అల్లర్లపైనా - అలజడులపైన కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు.

విలక్షణ నటుడు - హీరో కమల్ హాసన్ కావేరీ వివాదంపై తన దైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర జలాల వివాదాల ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్విట్టర్ లో స్పందించారు కమల్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేసిన అయన ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆదిమానవుల కాలంనుంచి ఈ కావేరీ జలాల వివాదం కొనసాగుతోందనీ, ఇది నిన్న పుట్టింది కాదు, రేపటితో ముగిసేది కాదు.. ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలాంటి పనులుచేసినవిగా చూసుకోవడం సిగ్గుచేటని కమల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాగా.. ఇదే విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించడం.. ఆవేదనను, కోపాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ.. దానికి ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాగాలేదని, రేపటి తరాలకు మనం ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే!