Begin typing your search above and press return to search.
సుషాంత్ సింగ్ జ్ఞాపకాల్లో రియా చక్రవరి!
By: Tupaki Desk | 14 Jun 2022 10:31 AM GMTబాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రేక్షకుల మధ్యలో లేకపోవచ్చు. కానీ అతని జ్ఞాపకాలు అభిమానుల జీవితాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. బాలీవుడ్లో అత్యంత ఇష్టపడే నటులలో సుషాంత్ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు దక్కించుకుని ఓ వెలుగు వెలిగారు.
బుల్లి తెరపై మొదలైన సుశాంత ప్రస్థానం వెండి తెర వరకూ ఎంతో స్ఫూర్తిదాయకం. అర్ధంతరంగా జీవితాన్ని ముగించినా...సుశాంత్ సినీ ప్రయాణం మాత్రం నవతారంలో ఎప్పటికీ ఓ స్ఫూర్తి. నేడు ఆయన వర్ధంతి. సుషాంత్ అభిమానుల్ని వదిలి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది.
నమ్మలేకోయినా..నమ్మక తప్పని నిజమది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు..అభిమానులు సుషాంత్ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురవుతున్నారు.
ఈ సందర్భంగా సుశాంత్ సోదరి బరువెక్కిన హృదయంతో ఇలా స్పందించారు. 'భాయ్... నువ్వు నీ దేహాన్ని విడిచి వెళ్లి రెండేళ్లు అయ్యింది. విలువల కోసం నిలబడిన నువ్వు ప్రజల గుండెల్లో అమరుడు అయ్యావు. అందరి పట్ల ప్రేమ.. దయ.. కరుణ చూపించడం నీ సద్గుణం. నువ్వు చాలా మందికి చాలా చేయాలని అనుకున్నావు. నీ గౌరవార్థం మేం ఆ పనులు చేస్తాం. నువ్వు ఈ లోకాన్ని మంచిగా మార్చావు' అని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కృతి పేర్కొన్నారు.
అలాగే సుషాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఇన్ స్టా వేదికగా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని కొన్ని ఫోటోలు పోస్ట్ చేసారు. మొదటి ఫోటోలో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి కూర్చున్న రియా చక్రవర్తి చిత్రాన్ని చూడవచ్చు. అందులో సుషాంత్ స్వచ్చమైన చిరునవ్వును గమనించ వచ్చు. తదుపరి చిత్రంలో రియా - సుషాంత్ ఇద్దరూ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు.
అందులో రియా సుశాంత్ బుగ్గలపై ముద్దు పెడుతన్నారు. ఇక చివరి ఫోటోలో సుశాంత్ రియాని తన చేతుల్లోకి తీసుకోవడం..ప్రేమను కురిపిచడం గమనించ వచ్చు. ఈ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ రియా ఎమోషన్ అయింది. 'సుషాంత్ ని ప్రతిరోజూ మిస్ అవుతున్నాను' అని రాసుకొచ్చింది.