Begin typing your search above and press return to search.
కరణ్ తో రియా పార్టీలు.. సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఫైర్!
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 AM GMTబాలీవుడ్ లో స్వపక్షపాతం అనేది నిరంతర చర్చగా మారింది. ఒక సెక్షన్ దర్శకనిర్మాతలు మాఫియాగా మారి తమ వారికి (ఇన్ సైడర్స్) మాత్రమే అవకాశాలు కల్పిస్తూ స్వతంత్రులుగా వచ్చిన ఔట్ సైడర్ ప్రతిభావంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కంగన లాంటి రెబల్స్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ఈ స్వపక్షపాతం ఒక కారణమన్న ఆరోపణలున్నాయి. అతడికి సరైన సమయంలో అవకాశాలు రాకుండా చేసి కుట్రలతో కెరీర్ పరంగా కుంగదీశారని కూడా టాక్ ఉంది.
అనంతర కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మిస్టీరియస్ డెత్ సంచలనమైంది. అతడు తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు ప్రకటించినా కానీ.. దీనివెనక కుట్ర కోణం దాగి ఉందని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. అలాగే సుశాంత్ సింగ్ మరణానికి డ్రగ్స్ లింకులు బాలీవుడ్ పార్టీ కల్చర్ తో సంబంధాలు బయటపడ్డాయి. అలాగే రియా చక్రవర్తి తెరవెనక పాత్ర గురించి అభిమానుల్లో బోలెడంత చర్చ సాగింది. రియా చక్రవర్తితో సుశాంత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపైనా డ్రగ్స్ కొనుగోళ్ల పైనా ఈడీ విచారణ సాగింది. డ్రగ్స్ .. పార్టీల కోణంలో విచారణలు సాగాయి. చివరికి సుశాంత్ సింగ్ మరణానికి కారణమేమిటో ఇప్పటికీ తేలలేదు.
ఇక సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్- జైలు శిక్ష వ్యవహారం అనంతరం బెయిల్ పై తాను జనబాహుళ్యంలోకి ప్రవేశించడం తెలిసిందే. అయితే ఇటీవల గ్లామర్ ప్రపంచంలో అవకాశాల కోసం రియా చేయని ప్రయత్నం లేదు. తిరిగి కెరీర్ ని సరికొత్తగా మలుచుకోవాలని కలలుగంటోంది. కానీ ఇప్పటివరకూ ఎవరూ తనకు సరైన అవకాశం కల్పించలేదు. ఇంతలోనే రియా పార్టీ క్రౌడ్ తో కనిపించడం హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తో కలిసి రియా చక్రవర్తి పార్టీలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు అంతర్జాలంలో రిలీజయ్యాయి. ఇవి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులకు చాలా కోపం తెప్పించాయి. ఎందుకంటే దివంగత నటుడు సుశాంత్ డిప్రెషన్ లోకి జారుకోవడానికి ప్రముఖ కారణం కరణ్ జోహార్ అని వారంతా భావించారు. సుశాంత్ సింగ్ మరణానంతరం కరణ్ ని తీవ్రంగా విమర్శించారు. అందుకే కరణ్ జోహార్ తో కలిసి రియా చక్రవర్తి పార్టీ నుంచి ఫోటోలు బయటకు రాగానే... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు భగ్గుమన్నారు. రియా ప్రవర్తనపై మరోసారి సోషల్ మీడియాల్లో విరుచుకుపడ్డారు. సుశాంత్ మరణానికి కారకుడైన వాడితో పార్టీలా? అంటూ విమర్శిస్తున్నారు. నిజానికి ప్రియుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత సాధారణ జీవితాన్ని గడపడానికి రియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తనపై పెచ్చు మీరిన ప్రతికూలత ట్రోలింగ్ లు ఉన్నప్పటికీ కొంతవరకూ ఇతరులతో కలవడంలో విజయం సాధించినట్లు అనిపిస్తోంది.
కానీ కరణ్ జోహార్ తో రియా చక్రవర్తి పార్టీ ఫోటోలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులను కలవరపెట్టాయి. స్వపక్షపాతం అజెండాతో సుశాంత్ ని ఎదగనివ్వకుండా చేసిన కుట్రదారు కరణ్ జోహార్. అలాంటి వ్యక్తితో పార్టీలు జరుపుకుంటుందా? అంటూ సుశాంత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ ను కుదిపేసింది. అనంతరం బాలీవుడ్ లో చాలా మార్పులొచ్చాయి. నేడు చాలా హిందీ సినిమాలు బహిష్కరణను ఎదుర్కొంటున్నాయి. ఈ బహిష్కరణ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద చిత్రాల భారీ వైఫల్యానికి దారితీస్తోంది. ఇటీవలి ఉదాహరణ అమీర్ ఖాన్ - లాల్ సింగ్ చద్దా.. అక్షయ్ సామ్రాట్ పృథ్వీరాజ్.. రక్షాబంధన్ లపై బహిష్కరణ అమలైంది. దీంతో ఈ చిత్రాలన్నీ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. మునుపెన్నడూ లేని తీవ్రమైన సన్నివేశమిది. ఈ మార్పు వెనక సుశాంత్ మరణం బాలీవుడ్ మాఫియా కారణాలుగా చెబుతున్నారు.
అయితే రియా చక్రవర్తి కరణ్ జోహార్ తో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఇతర ప్రముఖులతోను పార్టీల్లో చేరుతోంది. సెర్మా సజ్ దే- సుస్సానే ఖాన్ సహా పలువురు గాళ్స్ గ్యాంగ్ తో రియా పలుమార్లు పార్టీల్లో కనిపించింది. సీమా సజ్ దే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ పార్టీ ఫోటోలను షేర్ చేసారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కరణ్ తో రియా చక్రవర్తి పార్టీని గుర్తించడంతో ఇది కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది.
రియా ఏం చేసినా తన దారిలో తాను వెళుతోంది. వృత్తిపరంగా వ్యక్తిగతంగా బలంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా ఖాతాలో ఆమె వీడియోలు ఫోటోలను పంచుకోవడం ద్వారా ఆమె ప్రియమైన వారిని ప్రేరేపిస్తోంది. తనని వ్యతిరేకించే వారిని పట్టించుకోకుండా తానేం చేయాలో అది చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తిరిగి కెరీర్ ని గాడిన పెట్టేందుకు తనవంతు ప్రయత్నాల్లో ఉంది. రియా ఇటు టాలీవుడ్ లో పలువురు దర్శకనిర్మాతలకు టచ్ లో ఉందని ఇటీవల ప్రచారమైంది. తూనీగ తూనీగ చిత్రంలో నటించిన రియా చక్రవర్తి క్యూట్ లుక్స్ కి తెలుగు లోను ఫ్యాన్సున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.