Begin typing your search above and press return to search.
చితక్కొట్టుడు: వేడినీళ్ళలోకి దూకినట్టుందట!
By: Tupaki Desk | 7 Feb 2019 5:56 PM GMTటాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మాత్రమే మొదలైంది అనుకుంటే మీరు పొరబడినట్టే. బూతు సినిమాల ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని నెలల క్రితం 'ఏడు చేపల కథ' అంటూ ఒక అడల్ట్ సినిమా ప్రోమోలు హల్చల్ చేశాయి. ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు 'చీకటిగదిలో చితక్కొట్టుడు' అంటూ మరో అడల్ట్ సినిమా తయారయింది. ఇది ఉత్త అడల్ట్ కాదు.. బూతుకు భూతాన్ని మిక్స్ చేసిన సినిమా. ఈ సినిమా లో '24 కిస్సెస్' మూవీ ఫేం అదిత్ హీరోగా.. నిక్కి తంబోలి హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా ఆర్ జే హేమంత్ ఒక కీలకపాత్ర పోషించాడు. హేమంత్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా గురించి రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు హేమంత్. అడల్ట్ జోనర్ లో సినిమా చేసే ముందే మెంటల్ గా ప్రిపేర్ అయ్యామని..కానీ ఇప్పుడు మసులుతున్న వేడి నీళ్లలో దూకినట్టుంది అన్నాడు. మరి ఇలాంటి సినిమా చేస్తున్నందుకు ఇంట్లో వారి రెస్పాన్స్ ఎలా ఉంది అని అడిగితే "ఇలాంటి సినిమాలు చేస్తున్నామంటే ఎవరి ఇంట్లో అయినా ఒప్పుకోరు.. వద్దంటారు. అందుకే మా అమ్మ ఫోన్ నుంచి యూట్యూబ్ తీసేశాను. ఇప్పటివరకైతే వారికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను. ఇలాంటివి చూసి ఎవరి ఇంట్లో కూడా మెచ్చుకోరు.. తంతారు" అంటూ అసలు నిజం చెప్పాడు.
ప్రేక్షకులకు చితక్కొట్టుడు గురించి చెప్తూ.. "డైరెక్టర్ ఇప్పటికే ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. మాది అడల్ట్ సినిమా.. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదని చెప్పాడు. నేను అదే చెప్తున్నా.. ఫ్రెండ్స్ తో కలిసి చూసే సినిమా ఇది" అన్నాడు. ఇక ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ మెసేజులు ఉంటున్నాయట. కొందరు "ఏంటి హేమంత్.. ఇలాంటి సినిమా చేస్తున్నావా?" అని అడుగుతున్నారు. కొందరు స్టూడెంట్స్ మాత్రం మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయని.. ఆ లోపు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.. అని చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం చితక్కొట్టుడు తో ఆర్జే హేమంత్ పేరు అందరి నోళ్ళలో నానడం మాత్రం ఖాయం.