Begin typing your search above and press return to search.

లీకుల భామ లండన్ చెక్కేస్తోందా!!

By:  Tupaki Desk   |   8 March 2017 11:03 AM GMT
లీకుల భామ లండన్ చెక్కేస్తోందా!!
X
కొన్ని రోజులుగా సింగర్ సుచిత్రా కార్తీక్ ఆన్ లైన్ సెన్సేషన్ అయిపోయింది. దక్షిణ భారత్లో ఈమె టాప్ ట్రెండింగ్ లో నిలుస్తోందంటే.. సుచిలీక్స్ ఎంతగా హంగామా చేశాయో అర్ధమవుతుంది. ధనుష్.. త్రిష.. ఆండ్రియా.. అనిరుధ్ రవిచందర్.. సంచితా శెట్టి లాంటి పలువురు ప్రైవేట్ ఫోటోలు ఈమె ట్విట్టర్ అకౌంట్లో దర్శనమిచ్చేశాయి.

వీటిని ఆమే లీక్ చేస్తోందో.. లేక సుచిత్ర భర్త చెప్పినట్లుగా ఎవరైనా హ్యాకింగ్ చేసి పని కట్టుకుని పోస్ట్ చేస్తున్నారో అనే విషయం అర్ధం కానిదే. అయితే.. ఇప్పుడీమె లండన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. అంటే సుచిత్ర స్వయంగా వెళ్లిపోవడం లేదు కానీ.. కుటుంబ సభ్యులు అంతా కలిసి లండన్ టూర్ ప్లాన్ చేశారట. ఆమెను ఈ వాతావరణం నుంచి దూరంగా ఉంచడం కోసం.. ఆమెను కొత్త ప్రాంతానికి తీసుకెళితే కోలుకుంటుందనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారట. అక్కడ అవసరమైతే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న ఈమె.. త్వరలోనే లండన్ బయలుదేరనుంది.

అయితే.. సుచిత్ర అకౌంట్లో జరిగిన అన్ని లీకుల్లోకి ఎక్కువగా యాక్ట్రెస్ సంచితా శెట్టిపై ప్రభావం పడింది. ఏకంగా ఈమె న్యూడ్ వీడియో నెట్ లో దర్శనం ఇచ్చేయడంతో.. చాలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వీడియో నాది కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది సంచిత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/