Begin typing your search above and press return to search.

పుష్ప‌ను పొగిడి సామ్రాట్ అక్కీని మ్యాడీ తిట్టాడా?

By:  Tupaki Desk   |   4 July 2022 4:58 AM GMT
పుష్ప‌ను పొగిడి సామ్రాట్ అక్కీని మ్యాడీ తిట్టాడా?
X
ఈరోజుల్లో న‌టుల్లో నిబ‌ద్ధత ఎక్క‌డుంది? ఎక్క‌వ ప‌ని దినాలు కేటాయించే అల‌వాటు ఎంద‌రికి ఉంది? అంటూ ప్ర‌శ్నించాడు ఆర్.మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ. ఇది ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. అంతేకాదు.. అత‌డు కిలాడీ అక్ష‌య్ కుమార్ పైనే కౌంట‌ర్ వేసాడంటూ నెటిజ‌నుల్లో డిబేట్ సాగ‌డం.. అటుపై విలేక‌రులు నేరుగా అక్ష‌య్ ని.. ర‌క్షాబంధ‌న్ ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్.రాయ్ ని ఇదే ప్ర‌శ్న అడ‌గ‌డంతో దానికి వారు ధీటుగా బ‌దులిచ్చారు. ద‌ర్శ‌కుడు అడిగిన ప‌ని ఇవ్వ‌డం త‌న ప‌ని అని.. ప‌ని అయిపోయాక అత‌డితో గొడ‌వ‌ప‌డలేన‌ని అక్ష‌య్ అన్నారు. నిజానికి 40-45 రోజుల కాల్షీట్లు అంటూ మాధ‌వ‌న్ అంద‌రికీ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని ఆనంద్ ఎల్. రాయ్ ఖండించే ప్ర‌య‌త్నం చేసారు. ర‌క్షా బంధ‌న్ సినిమా కోసం అక్ష‌య్ స‌రిప‌డినంత స‌మ‌యం ప‌ని చేసార‌ని కూడా కితాబిచ్చారు.

ఇటీవ‌ల 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్' ప్రమోష‌న్స్ లో ఆర్ మాధవన్ ర‌క‌ రకాల అంశాల గురించి మాట్లాడుతూ న‌టుల్లో నిబ‌ద్ధ‌త‌పైనా మాట్లాడారు. మ్యాడీ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'రెహనా హై తేరే దిల్ మే' (RHTDM) రీమేక్ గురించి తన అభిప్రాయాన్ని ఇంతకుముందు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. అతను ఇకపై 'తను వెడ్స్ మను' ఫ్రాంఛైజీలో మను పాత్రను పోషించడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. కొంద‌రు న‌టీనటులు తమ ప్రాజెక్ట్ ల కోసం తగినంత సమయం ఇవ్వడం లేదని మాధ‌వ‌న్ ఒక ప్రకటన చేసారు. ఆ త‌ర్వాత 'సామ్రాట్ పృథ్వీరాజ్' న‌టుడు అక్షయ్ కుమార్ పై నెటిజ‌నులు దీనిని ఉద‌హ‌రిస్తూ కౌంట‌ర్లు వేసారు. ఆర్ మాధవన్- అక్షయ్ కుమార్ వేర్వేరు ఈవెంట్లలో ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన విష‌యాన్ని నెటిజ‌నం త‌వ్వి తీసారు.

ఆర్ మాధవన్ నటుల నుండి నిబద్ధత లేకపోవడం గురించి మాట్లాడగా దీనిపై అక్షయ్ కుమార్ స్పందించారు! అంటూ ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేస్తోంది. ఇంత‌కీ మ్యాడీ చేసిందేమిటీ? అంటే.. 40-45 రోజుల్లో తమ సినిమాలను పూర్తి చేసే నటీనటులను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం కేటాయించే నటులతో ఆర్ మాధవన్ పోల్చారు. అందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో మాధ‌వ‌న్ మాట్లాడుతూ.. "జైసే కే పుష్పా మే అల్లు అర్జున్ నే వో క్యారెక్టర్ కో అంతటా కియా హైని నిర్వహించండి. వో కమల్ కే దిఖ్తే హై ఔర్ డ్యాన్స్ భీ కర్తే హై. లేకిన్ యుఎస్ఎస్ ఫిల్మ్ అన్‌హోన్ యుఎస్ఎస్ క్యారెక్టర్ కో మెయింటెయిన్ కర్తే హ్యూ అన్‌హోన్ రొమాన్స్ భీ కియా ఔర్ డ్యాన్స్ భీ. తో ముఝే లగ్తా హై కి ఐసా ఏక్ యాక్టర్ కా కమిట్మెంట్ హోతా హై జహాన్ పే ఫిల్మీన్ 3-4 మహినే మే నహీ బంతీ పర్ సాలోన్ లాగ్ జాతా హై" అంటూ సుదీర్ఘంగా ఉప‌న్య‌సించాడు.

అత‌డు పుష్పను ఉద‌హ‌రించ‌డం ఇక్క‌డ ప్ర‌ధాన హైలైట్. "పుష్ప‌లో అల్లు అర్జున్ తన పాత్రను ఆద్యంతం చ‌క్క‌గా మెయింటైన్ చేసాడు. మనందరికీ తెలుసు.. బ‌న్ని ఆ పాత్ర‌లో చాలా గొప్పగా కనిపించాడు.. అత‌డు మంచి డాన్సర్ కూడా. కానీ ఈ చిత్రంలో తన లుక్ ను చాలా బాగా మెయింటైన్ చేసి రొమాన్స్ చేశాడు. ఆ అవతార్ తో డ్యాన్స్ చేసాడు. కాబట్టి 3-4 నెలలు డేట్స్ ఇవ్వకుండా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్ కోసం కేటాయించడం అనేది ప్రాథమికంగా నటుడిగా అత‌డి నిబద్ధత" అంటూ పొగిడేసాడు. పుష్ప‌ను పొగిడి సామ్రాట్ పృథ్వీరాజ్ గా ఫెయిలైన‌ అక్కీని మ్యాడీ తిట్టాడా? అంటూ ఆ త‌ర్వాత దీనిపై ఒక సెక్ష‌న్ నెటిజ‌నుల్లో చ‌ర్చ మొద‌లైంది.

దీనిని ఉటంకిస్తూ అక్షయ్ కుమార్ ని మీడియా ప్ర‌శ్నించింది. అక్ష‌య్ ని కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు 'రక్షా బంధన్' ప్ర‌చార వేదిక‌గా ఆర్ మాధవన్ వ్యాఖ్య గురించి అడిగారు. దానికి అత‌డు స్పందిస్తూ.. "మేరీ ఫిల్మీన్ ఖతం హో జాతి హై.. మెయిన్ క్యా కరుణ్. అబ్ ఏక్ డైరెక్టర్ ఆతా హై ఔర్ కెహతా హై ఆప్కా కామ్ ఖతం. తో అబ్ క్యా మెయిన్ ఉస్సే లదున్?" అని అన్నాడు. నా సినిమా చిత్రీక‌ర‌ణ‌ అయిపోయాక‌.. దర్శకుడు వచ్చి ఇక్కడ నీ పని అయిపోయింది అని చెప్పగానే నేనేం చేయాలి? అతనితో గొడవ పడాలా? అని అక్ష‌య్ ఎదురు ప్ర‌శ్నించాడు.

అదే వేదిక‌గా 'ర‌క్షాబంధన్' దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కూడా అక్ష‌య్ ని స‌మ‌ర్థించారు. ఆయ‌న దీనిపై ఇలా అన్నారు. "ఒక సినిమాని పూర్తి చేయడానికి 40-45 రోజులు పడుతుందని అతను(మాధ‌వ‌న్) పదేపదే చెబుతున్నాడు. అది ఇప్పుడు అతనికి పర్యాయపదంగా మారింది. అయితే ఇది తప్పుడు సమాచారం అని చెప్ప‌గ‌ల‌ను. వాస్తవానికి ఇలా చెప్పి అత‌డు ప్రజలను తప్పుదారి పట్టించాడు. మనం ఏ 40-45 రోజుల గురించి మాట్లాడుతున్నాము? అతను(అక్ష‌య్) ఉదయం 6 గంటలకు ప్రారంభించి మా పని కూడా పూర్తయ్యే వరకు కొనసాగేవాడు? తమకు 40-45 రోజుల పని మాత్రమే ఉందని అతనికి చెబుతూనే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజాయితీగా మీరు సమయం ప్రకారం లెక్కిస్తే.. అక్ష‌య్ మాకు 80-90 రోజులు ఇచ్చాడు అని అక్ష‌య్ ని స‌మ‌ర్థించాడు. అంటే అక్ష‌య్ కుమార్ వేకువ‌ఝాము నిదుర లేచిన‌ప్ప‌టి నుంచి ఆ 50 రోజులు టీమ్ తోనే ఉండిపోయి డెడికేటెడ్ గా ప‌ని చేస్తారు. దీన‌ర్థం రోజుకు మూడు కాల్షీట్లు ప‌ని చేసార‌ని అనుకోవాలి. దీనినుంచి మ‌రో కొత్త కోణం కూడా బ‌య‌ట‌ప‌డింది. హార్డ్ వ‌ర్క్ చేసే న‌టులు ర‌క‌ర‌కాల మార్గాల్లో సినిమా కోసం డెడికేటెడ్ గా ప‌ని చేయొచ్చు. కాల్షీట్లు ఎన్ని అనేదానికంటే ఎంత‌గా డెడికేట్ అయ్యి ఇచ్చిన డేట్ల కోసం ప‌ని చేస్తారు? అన్న‌ది కూడా ఇంపార్టెంట్. మ‌రి మాధ‌వ‌న్ కి అక్ష‌య్ గురించి ఆమాత్రం తెలియ‌ద‌ని అంటారా?