Begin typing your search above and press return to search.
#RRR ముంబై: రామ్ చరణ్ - రామారావు ఆకాశం ఎత్తు!
By: Tupaki Desk | 20 Dec 2021 6:14 AM GMTప్రీరిలీజ్ వేడుకలు ఆడియో వేడుకలు మనకు కొత్తేమీ కాదు. ప్రీప్రమోషన్ పేరుతో భారీ ఈవెంట్లను ప్లాన్ చేయడం టాలీవుడ్ లో చాలా కాలంగా కొనసాగుతోంది. గంటలు పూటల కొద్దీ సమయం వెచ్చించి సాంస్కృతిక కార్యక్రమాలు.. హీరోల ఎలివేషన్ సహా రకరకాల కార్యక్రమాలతో ప్యాకేజీలా డిజైన్ చేస్తారు ఈ వేడుకల్ని. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇలాంటివి చూడలేం.
అక్కడ ప్రమోషన్ కట్టె కొట్టె తెచ్చే తరహాలో సాగుతుంది. ఇక హిందీ పరిశ్రమతో పోలిస్తే టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల్లో అభిమానం వేరు. ఇక్కడ తమ ఫేవరెట్ హీరోలను దేవుళ్లతో సమానంగా కొలుస్తారు అభిమానులు. వేడుకల వేళ రచ్చ రచ్చ చేస్తారు.
ఇప్పుడు ముంబై ఈవెంట్ తో ఆర్.ఆర్.ఆర్ టీమ్ హిందీ ప్రజలకు కొత్త సందేశాన్నివ్వబోతోంది. ఇక్కడ హీరోలకు ఫ్యానిజం ఏ రేంజులో ఉంటుందో ఆవిష్కరించనుంది. ఎన్టీఆర్ -రామ్ చరణ్ ల RRR ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక కానుంది. రోర్ ఆఫ్ RRR పేరుతో భారీ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ వేడుకకు సల్మాన్ భాయ్ ముఖ్య అతిథిగా ఎటెండ్ కానున్నారు.
దీనికోసం తారక్.. చరణ్ అభిమానులు భారీ సంఖ్యలో ముంబైకి తరలి వెళ్లారు. నిజానికి అభిమానులు ముంబై చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినా కోవిడ్ నిబంధనల వల్ల మహా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
అటుపై అభిమాన సంఘాల సమన్వయంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అభిమానులు ముంబై ఫిల్మ్ సిటీకి సమీపంలోని గురుకుల్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం గ్రౌండ్స్ లో ఒకటే కోలాహాలం సందడి నెలకొంది. బహుశా ఏ హిందీ హీరో కూడా ఇలాంటి గొప్ప ఫ్యాన్ డమ్ ని ఆస్వాధించి ఉండరంటే అతిశయోక్తి కాదు.
ముంబై వీధుల్లో ఇంతకుముందెన్నడూ కనిపించని గడబిడ కోలాహాలం కనిపిస్తోందంటే అది తెలుగు గడ్డ పై నుంచి వెళ్లిన అభిమానుల హంగామా అన్నది అక్కడి ప్రజలు గుర్తించే తరుణమిది. ఇలాంటివి బాలీవుడ్ కు పూర్తిగా కొత్త.
బాలీవుడ్ కి గ్రాండ్ వెల్కం:
ఇక హిందీ పరిశ్రమకు చరణ్ .. తారక్ కొత్తేమీ కాదు. దక్షిణాది అగ్రహీరోలుగా వారికి గౌరవం గుర్తింపు ఉన్నాయి. చరణ్ ఇప్పటికే మగధీర- జంజీర్ తో సుపరిచితుడు. తారక్ నటించిన పలు అనువాద చిత్రాలు హిందీలోనూ మెప్పు పొందాయి. తారక్ .. చరణ్ ఇక ఆర్.ఆర్.ఆర్ తో మరింతగా అక్కడి ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే అనంతరం భారీ హిందీ చిత్రాల్లో నటించే అవకాశాలు ఆ ఇద్దరికీ వస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రీరిలీజ్ లైవ్ కార్యక్రమమేనా..?
ముంబై నుంచి వచ్చిన తాజా సమాచారం మేరకు.. ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ వేడుకను లైవ్ చేయరని తెలిసింది. ఇది రికార్డెడ్ కార్యక్రమం. ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం చేయరు.. కార్యక్రమం పూర్తయ్యాక కొన్ని ప్రముఖ ఛానెల్ లో ప్రసారం చేస్తారు. ఈవెంట్ ఆసక్తికరంగా ఉండేలా ఎడిట్ చేసి విడుదల చేస్తారు.
హిందీ ప్రమోషన్స్ కోసం ఈ విజువల్స్ ని విస్తృతంగా ఉపయోగిస్తారు. టీవీల ద్వారా ఈ ప్రత్యేక వేడుక హంగామా హిందీ ప్రజల్లో కి దూసుకెళుతుందన్నది మేకర్స్ ప్లాన్. ఇక తెలుగు హీరోల ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో హిందీ జనాలకు పూర్తిగా తెలిసి రానుందని గుసగుస వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతోంది. హిందీ బెల్ట్ లోనూ అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు.