Begin typing your search above and press return to search.
''రోర్ ఆఫ్ RRR'' వచ్చేసింది..!!
By: Tupaki Desk | 15 July 2021 6:02 AM GMTభారతీయ సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ''ఆర్ ఆర్ ఆర్'' (రణం రౌద్రం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ కూడా సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తూ వస్తోంది. హీరోహీరోయిన్లు ఫస్ట్ లుక్స్ - తారక్ మరియు చరణ్ ల ఇంట్రో వీడియోలు - అజయ్ దేవగన్ స్పెషల్ వీడియో లతో పాటుగా స్పెషల్ పోస్టర్స్ కూడా విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ''రోర్ ఆఫ్ RRR'' అనే పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
'ఆర్.ఆర్.ఆర్' వంటి వెండితెర అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి జక్కన్న అండ్ టీమ్ ఎంతటి కృషి చేసింది అనేది ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ''అల్టిమేట్ థియేటర్ ఎక్సపీరియన్స్ ఇవ్వడానికి చేసే ప్రయత్నం ఇక్కడ ఉంది. ఇది చాలామంది కృషి ఫలితం. వందలాది తారాగణం.. సిబ్బంది యొక్క ప్రేమ శ్రమ అయిన RRR మూవీ యొక్క గ్లిమ్స్ మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాము'' అని ఆర్.ఆర్.ఆర్ టీమ్ పేర్కొంది. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్లే రాజమౌళి ''రోర్ ఆఫ్ RRR'' ని మేకింగ్ వీడియోలా కాకుండా స్పెషల్ ట్రైలర్ మాదిరిగా కట్ చేశారు. గూస్ బమ్స్ తెప్పించేలా దీన్ని డ్8డిజైన్ చేశారని చెప్పవచ్చు.
ఇందులో అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ లుగా నటించిన రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు 'ఆర్.ఆర్.ఆర్' ఏ రేంజ్ లో కష్టపడ్డారో అర్థం అవుతోంది. భారీ సెట్స్ ఏర్పాటు చేసి భారీ క్యాస్టింగ్ అండ్ సిబ్బందితో దర్శకుడు రాజమౌళి చిత్రీకరణ ఏ విధంగా చేసారనేది తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ - ఆర్ట్ డైరెక్టర్ శాబు సిరిల్ కష్టం ఇందులో కనిపిస్తోంది. అజయ్ దేవగణ్ - సముద్రఖని - శ్రియ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - రే స్టీవెన్ సన్ - అలిసన్ డూడి.. ఇలా పాత్రకు సంబంధించిన విజువల్స్ ఇందులో చూపించారు. ఈ వీడియో ద్వారా దసరా కానుకగా అక్టోబర్ 13న RRR ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మరోసారి స్పష్టం చేశారు.
''రోర్ ఆఫ్ RRR'' వీడియోకి సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేస్తే ప్రముఖ ర్యాపర్ బ్లేజ్ దీనికి ర్యాప్ ఆలపించారు. ఈ ర్యాప్ లిరిక్స్ ని బ్లేజ్ మరియు ఆదిత్య అయ్యంగార్ కలిసి రచించారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అచ్చు రమణి - జీవన్ బాబు దీనికి ప్రోగ్రామింగ్ చేశారు. మొత్తం మీద 1920స్ నాటి కాలాన్ని పరిస్థితులు సృష్టించి ఇద్దరు వారియర్స్ ని ఒకచోట చేర్చడానికి 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ పడిన కష్టం అంతా ఈ ఒక్క వీడియోలో కనిపిస్తోంది. దీనికి వీఎఫెక్స్ వర్క్స్ యాడ్ చేసి రేపు థియేటర్లలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అది1కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జక్కన్న సన్నాహాలు చేసుకుంటున్నారు.