Begin typing your search above and press return to search.

మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మకం.. చాలా తక్కువ ధరకే!

By:  Tupaki Desk   |   25 Dec 2020 11:30 PM GMT
మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మకం.. చాలా తక్కువ ధరకే!
X
మైఖేల్ జాక్సన్.. పాప్ సంగీత సామ్రాజ్యానికి రారాజు. ఇటు ఆటతో.. అటు పాటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జాక్సన్. అలాంటి మ్యూజిక్ దిగ్గజాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. పదకొండేళ్ల క్రితం మరణించిన మైఖేల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

మైఖేల్ జాక్స‌న్‌కు చెందిన నెవ‌ర్‌ల్యాండ్ ఎస్టేట్ ఇటీవల అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాలో ఉన్న ఆ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియ‌నీర్ రాబ్ బ‌ర్క్లే కొనుగోలు చేశారు. సుమారు 2.2 కోట్ల డాల‌ర్లుకు నెవ‌ర్‌ల్యాండ్ అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. 2,700 ఎక‌రాలు ఉన్న నెవ‌ర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ అత్యంత అద్భుతంగా తీర్చ‌దిద్దారు.

కానీ.. నెవ‌ర్‌ల్యాండ్ ఎస్టేట్ మైఖేల్ కెరీర్‌లో ఓ మ‌చ్చ‌గా కూడా మిగిలింది. జాక్సన్ ఇక్కడే.. చిన్న పిల్ల‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. మైఖేల్ మ‌ర‌ణానికి ఏడాది ముందే ఆ ఎస్టేట్‌ను థామ‌స్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత నెవ‌ర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను ‘సైకామోర్ వాలీ రాంచ్‌’గా పేరు మార్చారు.

తాజాగా.. ఆ ఎస్టేట్ ను మోంటానాకు చెందిన వ్యాపార‌వేత్త బ‌ర్క్లే కొనుగోలు చేశారు. నిజానికి చాలా త‌క్కువ ధ‌ర‌కే జాక్స‌న్ స్థ‌లం అమ్ముడుపోయింది. 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్మేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ.. ఏం జరిగిందో ఏమో కానీ.. వ్యాపార‌వేత్త బ‌ర్క్లే కేవ‌లం 22 మిలియ‌న్ల డాల‌ర్ల‌కే ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ఆయ‌న త‌ర‌పు ప్ర‌తినిధి వెల్ల‌డించారు. నెవ‌ర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్స‌న్ 1980 ద‌శ‌కంలో 20 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఖ‌రీదు చేశాడు. కాగా.. 2009లో మైఖేల్ జాక్స‌న్ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే.