Begin typing your search above and press return to search.
ఆ మాల్ లో అర్ధరాత్రి దాటాక రోబో-2
By: Tupaki Desk | 19 May 2016 12:52 PM GMTఈ రోజుల్లో పబ్లిక్ లో షూటింగ్ అంటే అంత సులువు కాదు. అందులోనూ స్టార్ హీరోలు నటించిన సినిమాలంటే ఇంకా ఇంకా కష్టం. ఇక రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా.. శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ తీస్తున్న సినిమా అయితే ఇక చెప్పేదేముంది? ఐతే శంకర్-రజినీ మాత్రం చెన్నైలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో ఎంచక్కా షూటింగ్ చేసేస్తున్నారు. అలాగని షూటింగ్ కోసం జనాల్ని బయటికి పంపించేసి.. మొత్తంగా మాల్ ను స్వాధీనం ఏమీ చేసుకోలేదు రోబో-2 టీమ్. చక్కగా అర్ధరాత్రి దాటాక షూటింగ్ చేసుకుంటున్నారు. ఇలా ఒకట్రెండు రోజులు కాదు.. కొన్ని వారాల పాటు ఇలాగే షూటింగ్ కొనసాగిస్తున్నారు.
చెన్నైలోని విజయ ఫోరం మాల్ లో కొన్ని వారాల పాటు అర్ధరాత్రి పూట షూటింగ్ చేసుకోవడం కోసం అద్దెకు తీసుకుంది రోబో-2 టీమ్. రెండు రోజుల కిందటే అక్కడ షూటింగ్ మొదలైంది. తొలి రోజు రాత్రి 2 గంటల నుంచి ఉదయం ఆరున్నర వరకు అక్షయ్ కుమార్ మీద ఓ కీలక సన్నివేశం తీశాడు శంకర్. తర్వాతి రోజుల్లో రజినీ కూడా ఈ షూటింగ్ లో జాయినయ్యే అవకాశముంది. తాను కోరుకున్న విధంగా సన్నివేశం రావాలంటే ఈ మాల్ లోనే షూట్ చేయాలని శంకర్ ఫిక్సయ్యాడు. ఐతే జనాల్ని ఆపి పగటి పూట షూటింగ్ అంటే అద్దె చాలా చాలా ఎక్కువవుతుంది.. పైగా అందుకు ఏ మాల్ కూడా అంగీకరించకపోవచ్చు. కాబట్టే ఈ ఏర్పాటు చేసుకున్నాడు శంకర్. ఐతే అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా షూటింగ్ అంటే యూనిట్లో అందరికీ కష్టమే. అయినా తప్పదని శంకర్ ఇలా ప్లాన్ చేశాడు.