Begin typing your search above and press return to search.
2.0 తోనే రెహమాన్ బిజినెస్ మొదలు
By: Tupaki Desk | 12 Oct 2017 12:31 PM GMTదేశం మెచ్చిన దర్శకుడు శంకర్ ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడి ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 2 పాయింట్ ఓ. తన సినిమాలతో సోషల్ మెస్సేజ్ ఇస్తూనే కమర్షియల్ తరహాలో సినిమాను తెరకెక్కించే శంకర్ 2.0 సినిమాను కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దాదాపు 400 కోట్లతో తీశాడట. ఇప్పటివరకు ఇండియాలో ఈ స్థాయి బడ్జెట్ ఏ సినిమాకు పెట్టలేదు అటువంటి సినిమాను లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న 2.0 ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులల్లో బిజీగా ఉంది. దాదాపు గ్రాఫిక్స్ పనులు కూడా చివరిదశలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడే సినిమాలోని చివరి పాటను కూడా చిత్రీకరిస్తే ఓ పనైపోతుందని దర్శకుడు శంకర్ డిసైడ్ అయ్యాడు. ఇకపోతే ఆ సాంగ్ ని రెహమాన్ కొత్తగా స్థాపించిన వైఎమ్ స్టూడియోస్ లో చిత్రీకరించడానికి రెడీ అయ్యారు. రెహమాన్ చెన్నైలో రీసెంట్ గా స్టూడియోస్ ని స్థాపించాడు. అయితే ఆ స్టూడియో లో మొట్ట మొదట 2.0 సాంగ్ చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఎన్నో ఏళ్లుగా భారతీయ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న రెహమాన్ చాలా రోజుల తర్వాత బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2.0 చివరి పాట తో స్టూడియో ని గ్రాండ్ గా ఓపెన్ చేయడంతో ఇప్పుడు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ అటువైపు చూస్తోంది. అత్యాధునిక టెక్నాలిజీని సైతం రెహమన్ తన స్టూడియోలో అందుబాటులోకి తెచ్చాడట. తాను మ్యూజిక్ చేసిన సాంగ్ షూట్ తన స్టూడియోలోనే స్టార్ట్ అవ్వడంతో రెహమాన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.