Begin typing your search above and press return to search.
నిర్మాత కొడుకు రజినీని పట్టుకోబోయి..
By: Tupaki Desk | 5 Dec 2016 5:30 PM GMTతన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతి పంచాలని ప్రయత్నిస్తుంటాడు శంకర్. అతను కొత్త టెక్నాలజీని టచ్ చేశాడంటే.. అది వంద శాతం పర్ఫెక్టుగా ఉండాలని చూస్తాడు. ఈ విషయంలో రాజీ అన్నదే ఉండదు. ఇప్పుడు త్రీడీ టెక్నాలజీ విషయంలోనూ శంకర్ ఇదే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటిదాకా ఇండియాలో వచ్చిన త్రీడీ సినిమాలన్నీ పూర్తిగా త్రీడీలో తెరకెక్కినవి కావని.. ముందు 2డీలో తీసి.. తర్వాత త్రీడీలోకి మారుస్తున్నారని.. కానీ ‘2.0’ను మాత్రం పూర్తిగా త్రీడీలోనే తెరకెక్కిస్తున్నారని.. ఇండియాలో ఇలా త్రీడీ సినిమా తీయడం ఇదే తొలిసారని అంటున్నాడు ‘2.0’ నిర్మాతల్లో ఒకడైన రాజు మహాలింగం.
త్రీడీలో రజినీకాంత్ ను చూసి అభిమానులు థ్రిల్లవడం ఖాయమని అంటున్నాడు రాజు మహాలింగం. ఇటీవలే తన పదేళ్ల కొడుకుని ‘2.0’ షూటింగుకి తీసుకెళ్లి.. అక్కడ త్రీడీ గ్లాసులేయించి రషెస్ చూపించగా.. అతను రజినీ తన దగ్గరికి వస్తున్నాడని భ్రమించి.. ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడని రాజు తెలిపాడు. వచ్చే ఏడాది దీపావళికి ‘2.0’ విడుదలయ్యాక ప్రతి ప్రేక్షకుడికీ ఇలాంటి అనుభూతే కలుగుతుందని చెప్పాడు. ‘2.0’లో కేవలం మల్టీప్లెక్సుల వరకే కాకుండా బి.. సి సెంటర్లలోనూ త్రీడీలో చూపించాలని ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం ఒక భారీ ప్రాజెక్టును తలకెత్తుకున్నామని.. అన్ని థియేటర్ల వాళ్లతోనూ సంప్రదింపులు జరుపుతూ త్రీడీకి అప్ గ్రేట్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నామని రాజు మహాలింగం తెలిపాడు. మొత్తానికి ‘2.0’ ఇండియన్ సినిమాలో ఓ మైలురాయిలా మారేలాగే కనిపిస్తోంది ఈ చిత్ర నిర్మాత మాటలు చూస్తుంటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/