Begin typing your search above and press return to search.

2 పాయింట్ ఓ.. తెలుగు సాంగ్స్.. యాంటో

By:  Tupaki Desk   |   28 Oct 2017 1:42 PM GMT
2 పాయింట్ ఓ.. తెలుగు సాంగ్స్.. యాంటో
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ హాట్ టాపిక్ అంటే రజినీకాంత్ నటించిన 2.ఓ మూవీనే. నిన్ననే దుబాయ్ లో ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గానే సెలబ్రేట్ చేశారు. ఆ ఈవెంట్ కు బాగానే రియాక్షన్ లభించింది. ఈ సందర్భంగా రెండు పాటలను స్వయంగా తానే పెర్ఫామ్ చేసి అలరించాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.

ఇప్పుడీ 2.ఓ చిత్రం తెలుగు వెర్షన్ కు సంబంధించిన పాటలు రిలీజ్ అయ్యాయి. సహజంగానే రెహమాన్ స్వరపరిచే సినిమాల్లోని పాటలు ఏ మాత్రం అర్ధం కాకుండానే ఉంటాయి. ఇప్పుడు 2.ఓ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి తగినట్లుగా పాటలు రాసుకోవాలి. పైగా ఆయన తమిళ్ వెర్షన్ కి మ్యూజిక్ ఇస్తాడు. దీంతో రైటర్లకు చాలా పరిమితులుంటాయి. ఈ మూవీలో 2 సాంగ్స్ రిలీజ్ చేయగా.. రెండూ అలాగే కాసింత గందరగోళంగానే అనిపిస్తాయి.

ఆల్బంలో మొదటగా వినిపించే 'యంతర లోకపు సుందరివే' పాటను అనంత శ్రీరాం రాయగా.. సిద్ శ్రీరాం.. శాస్తా తిరుపతి పాడారు. ఈ పాటను ఎంత కష్టపడి విన్నా.. గట్టిగా అర్ధమయ్యే లైన్ ఆ పాట పల్లవి మాత్రమే. ట్యూన్ మాత్రం వినసొంపుగా ఉన్నా.. పాట ఏ మాత్రం అర్ధం కాని పరిస్థితి. స్లో సాంగ్ కే ఇలాంటి కష్టమంటే.. ఇదే పాట స్పీడ్ గా ఉండి ఉంటే అనిపించక మానదు.

రండాలి అంటూ సాగే రెండో పాటను భాస్కర బాట్ల రాయగా.. బ్లేజ్.. అర్జున్ చాందీ.. నివాస్ లు పాడారు. మొదటి పాటలో వినిపించిన సిగ్నేచర్ ట్యూన్ లో కూడా వినిపించడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పాట ఓ మోస్తరు వేగంతో సాగుతుంది కానీ.. ఇందులో కూడా లిరిక్ లోని పదాలను మ్యూజిక్ డామినేట్ చేసినట్లే అనిపిస్తుంది. మొత్తం మీద 2.ఓ ఆల్బమ్ కు.. మ్యూజిక్ లవర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.