Begin typing your search above and press return to search.
చైనాలోనూ నిరాశే..!
By: Tupaki Desk | 13 Sep 2019 4:14 AM GMTరజినీకాంత్.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చింది. దాదాపుగా 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. కాని సినిమా ఆశించిన వసూళ్లను రాబట్టలేక పోయింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా 2.ఓ చిత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. ఇక్కడ ఫలితం నిరాశపర్చినా కూడా చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
సెప్టెంబర్ 6వ తారీకున '2.ఓ' చిత్రం చైనా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. మొదటి రోజు పర్వాలేదు అన్నట్లుగా 9 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాని ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్స్ తగ్గింది. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి ఈ చిత్రం దాదాపుగా 22 కోట్లను వసూళ్లు చేసింది. చైనాలో ఈ మొత్తం తక్కువే అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. అందుకోసం చాలా ఖర్చు చేస్తారు. ఆ ఖర్చుతో పోల్చితే ఇది తక్కువే అని చెప్పక తప్పదు.
రోబో చిత్రం సంచలన విజయాన్ని సాధించిన తర్వాత ఆ కాంబోలో మూవీ అది కాకుండా 450 కోట్ల బడ్జెట్ అనగానే హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా భావించారు. కాని సినిమా నిరాశ పర్చింది. చైనా ప్రేక్షకులు అయినా ఈ భారీ విజువల్ వండర్ ను ఆధరిస్తారని భావిస్తే వారు కూడా అంతంత మాత్రంగానే సినిమా ఉందని తేల్చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు పెట్టుకున్న 100 కోట్ల ఆశలు గల్లంతయ్యాయి.