Begin typing your search above and press return to search.
రోబో మరో రికార్డు సృష్టించింది!
By: Tupaki Desk | 13 March 2016 11:21 AM GMTరజనీకాంత్ - శంకర్ ల కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'రోబో2'. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సుమారుగా 350 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాకు చిత్రబృందం ఇన్సూరెన్సు పాలసీ తీసుకుందట. భారతదేశంలో తక్కువ గానీ, ప్రతీ హాలీవుడ్ చిత్రానికీ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవడం సర్వసాధారణం. 350 కోట్ల హై బడ్జెట్ తో రూపుదిద్దుకొంటున్న సినిమా కాబట్టి.. చిత్రబృందం ఏ విషయంలోనూ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
తాజాగా 'రోబో2' కి 350 కోట్ల రూపాయలతో ఇన్సురెన్సు తీసుకొన్నారు. షూటింగ్ సమయంలో ఏమైనా ప్రమాదం జరిగినా, సినిమా ముందే లీకై నిర్మాతలకు అనూహ్యమైన నష్టాలు కలిగించినా.. ఇన్సూరెన్స్ పాలసీ వర్తించే విధంగా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకొందట. అలా.. దక్షిణాదిన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొన్న తొలి చిత్రంగా రోబో రికార్డు సృష్టించింది. రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడు.