Begin typing your search above and press return to search.

2.0 వీడియో ఇప్పుడెందుకు కాలా

By:  Tupaki Desk   |   4 March 2018 7:46 AM GMT
2.0 వీడియో ఇప్పుడెందుకు కాలా
X
సూపర్ స్టార్ రజనికాంత్ సినిమాలు ఒకేసారి సెట్స్ పై ఉండటం, అటు ఇటుగా తక్కువ గ్యాప్ లో రెండు విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం చాలా కాలం తర్వాత జరుగుతోంది. ఏప్రిల్ 27 కాలా విడుదల ఖరారు చేసారు కాబట్టి ఇక సస్పెన్స్ ఉన్నది ఒక్క 2.0 విషయంలో మాత్రమే. ఇప్పటికీ లైకా సంస్థకు కాని, దర్శకుడు శంకర్ కు కాని ఫలానా టైంలో విడుదల చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. ఆగస్ట్ 15 అని ఒకసారి లేదు లేదు తమిళుల ఫేవరెట్ ఫెస్టివల్ దీపావళికి అని మరోసారి ఇలా వార్తల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఒక తమిళ పత్రిక ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి అసలు 2.0 ఈ సంవత్సరం వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. దాని కథనం ప్రకారం 2019 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.

దీని సంగతి అలా ఉంచితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో 2.0 మేకింగ్ కి సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. మంచి క్లారిటీ తో నీట్ గా ఎడిట్ చేసి కట్ చేసిన ఆ వీడియో టీజర్ తరహాలో 77 సెకండ్ల పాటు ఉంది. అందులో ఆన్ సెట్స్ లో రజని, అక్షయ్ కుమార్ పాల్గొన్న రిస్కీ యాక్షన్ షాట్స్ కి సంబంధించిన మేకింగ్ ఫుటేజ్ ఉంది. హీరొయిన్ అమీ జాక్సన్ మీద తీసిన కొన్ని సీన్స్ తాలుకు బిట్స్ కూడా ఇందులో పొందుపరిచారు. ఇదేదో లీక్ అయినట్టు లేదు. పక్కా ప్లానింగ్ తో టైటిల్ కార్డు కూడా వేసి మరీ రూపొందించి వదిలినట్టు అనిపిస్తుంది. వీడియో చూస్తే మీరే గమనించవచ్చు.

కాని అసలు డౌట్ ఏంటంటే ఒకపక్క కాలాకే రావలసినంత హైప్ రాక ధనుష్ తలపట్టుకు కూర్చుంటే ఇప్పుడు ఈ 2.0 వీడియోలు ఎందుకు వదులుతున్నారో అర్థం కావడం లేదు. కాలా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ ని ఇంకా జాగ్రత్తగా డిజైన్ చేసే పనిలో ఉంది వండర్ బార్ సంస్థ. 2.0 ఎలాగూ చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వల్ల వచ్చిన ఉపయోగం లేదు కాని ఇందులో ఉన్న స్టన్నింగ్ విజువల్ మేకింగ్ మాత్రం మళ్ళి మళ్ళి చూసేలా చేస్తోంది. మీరు కూడా ఒక లుక్ వేయండి.