Begin typing your search above and press return to search.
2.0 బలవంతపు పబ్లిసిటీ!?
By: Tupaki Desk | 26 Nov 2018 4:58 PM GMT2.ఓ సినిమాకి బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది!.. ఇదేనా 2.ఓ నిర్మాతల ఫీలింగ్? అంటే అవుననే నేటి సాయంత్రం హైదరాబాద్- పార్క్ హయత్ లో చిత్రయూనిట్ డిక్లేర్ చేసింది. 2.ఓ సినిమా ట్రైలర్ - పాటలు - మేకింగ్ వీడియోలతో అందరిలోకి దూసుకెళ్లిపోయిందని - దీనికి కామన్ ఆడియెన్ లో ప్రచారం అవసరం లేదని టీమ్ కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేసింది. ఇటీవలే రిలీజైన వీడియో సాంగ్ తో 2.ఓ గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ చక్కని ఫాలోయింగ్ పెరిగిందని ఎన్ విఆర్ సినిమాస్ అధినేతల్లో ఒకరైన దిల్ రాజు స్ట్రాంగ్ గా ఈ వేదికపై చెప్పారు. ఇక రజనీ సైతం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రచారం దక్కిందని - ఎన్ వి ప్రసాద్ బృందం అనవసరంగా ఇదంతా(వేడుక) చేస్తోందని అన్నారు.
ఇదంతా చూస్తుంటే 2.ఓ విజయంపై టీమ్ ధీమాని అంచనా వేయొచ్చు. అయితే ఈ సినిమా కామన్ ఆడియెన్ కి ఎంతవరకూ కనెక్టవుతుంది? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది హైఫై టెక్నలాజికల్ చిత్రం. ఇప్పటికే వెబ్ - సామాజిక మాధ్యమాల్లో సినిమా బాగానే పాపులరైనా.. రోబో అంత పెద్ద రేంజు హిట్టవుతుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
నిజానికి 2.0 చిత్రానికి హైదరాబాద్ ప్రమోషన్ ఉంటుందా? అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీ - శంకర్ - అక్షయ్ బృందాన్ని ఇటువైపు మరల్చడంలో ఎన్ వీ ప్రసాద్ బృందం చాలానే చేయాల్సొచ్చిందని అందరికీ అర్థమైంది. ఓవైపు తమిళ వెర్షన్ ప్రమోషన్స్ - మరోవైపు హిందీ వెర్షన్ ప్రమోషన్స్ తో తలమునకలుగా ఉన్న ఈ బృందం తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ ని లైట్ తీసుకున్నారనే వారి మాటల్ని బట్టి అర్థం చేసుకోవాల్సొచ్చింది. దాదాపు 82 కోట్లు చెల్లించి ఎన్ వి ప్రసాద్ బృందం ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు. కనీస ప్రచారం లేకపోతే .. ఇక్కడ కాస్టింగ్ కనిపించకపోతే మరో `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` ఫలితం చూడాల్సి ఉంటుందని భయపడ్డట్టే కనిపించింది. చెన్నయ్ - ముంబై - దుబాయ్ లాంటి చోట ప్రమోషన్స్ చేశారు. హైదరాబాద్ లో చేయాలని ఎన్వీ ప్రసాద్ పట్టుబట్టడం వల్లనే రజనీ-అక్షయ్ టీమ్ ఇటువైపు వచ్చారట. టీమ్ కాన్ఫిడెన్స్ మెచ్చుకునేలా ఉన్నా.. ఇక్కడ స్టార్లు కనిపించి ప్రచారం చేస్తే ఆ ఊపు ఇంకో లెవల్లో ఉంటుంది కదా! అన్న చర్చా మీడియాలో సాగింది.