Begin typing your search above and press return to search.
రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్!?
By: Tupaki Desk | 29 Jan 2018 7:23 AM GMTరజినీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ విడుదలకు ఇంకా ముహూర్తం సెట్ కావడం లేదు. ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదల అంటూ రజినీకాంత్ స్వయంగా చెప్పడంతో టాలీవుడ్ సినిమాలు తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 27 అంటూ నిర్మాతల నుంచి లీకులు రావడంతో మళ్లీ ఛేంజెస్ తప్పలేదు.
అయితే.. ఇప్పుడు మరోసారి సమ్మర్ సినిమాలు డేట్స్ పై కుస్తీ పట్టక తప్పేటట్లు లేదు. ఇందుకు కారణం.. 2.ఓ రిలీజ్ పై మరోసారి అనుమానాలు తలెత్తడమే. అయితే.. ఈ సారి జస్ట్ అనుమానాలు మాత్రమే కాదు.. పలు కీలక సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్ అవుట్ పుట్ నచ్చకపోవడంతో.. దర్శకుడు శంకర్ అసహనం వ్యక్తం చేశాడని.. తను పూర్తిగా శాటిస్ఫై అయ్యేవరకూ రిలీజ్ కు యాక్సెప్ట్ చేయనని చెప్పాడట. ఇవి సుదీర్ఘమైన.. పూర్తిగా గ్రాఫికల్ బేస్డ్ సీన్స్ కావడంతో.. ఎక్కువ సమయమే పడుతుందట. అందుకే ఇప్పుడప్పుడే ఈ వర్క్ పూర్తి చేసి సినిమాను సమ్మర్ కు తేవడం అసాధ్యం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి 2.ఓ ఇప్పటికే థియేటర్లలో ఉండాల్సిన మూవీ. కానీ శంకర్ మాత్రం తను ఇండియాలో అత్యధికంగా ఖర్చు పెట్టించి తీయిస్తున్న సినిమాపై బాగా పట్టుదలగా ఉన్నాడట. 450 కోట్లను కేవలం పెట్టుబడిగానే పెట్టిన ఈ చిత్రం విషయంలో.. ఏ చిన్న తేడా రాకుండా ఉండేందుకు.. నిరవధికంగా వాయిదా వేసేందుకు రెడీ అయిపోయాడట శంకర్.