Begin typing your search above and press return to search.

క్లైమాక్స్ 20 నిమిషాలు కుర్చీ అంచుపైనే!

By:  Tupaki Desk   |   21 Nov 2018 4:15 AM GMT
క్లైమాక్స్ 20 నిమిషాలు కుర్చీ అంచుపైనే!
X
రోబో శంక‌ర్ నుంచి 2.ఓ రిలీజ్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. నాటి రోబో సంచ‌ల‌నాల్ని అభిమానులు మ‌రోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి 2.ఓ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతోంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఈ సినిమా బాహుబ‌లి 2 - దంగ‌ల్ రికార్డుల్ని కొట్టేస్తుందా? అన్న చర్చ సాగుతోంది. ఆ రెండు సినిమాల‌కు ధీటుగా 2.ఓ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. సుమారు 8000-9000 స్క్రీన్ల‌లో రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ స‌న్నాహాలు చేస్తోంది. ఇండ‌స్ట్రీ బెస్ట్ రికార్డును అందుకోవ‌డ‌మే ధ్యేయంగా రిలీజ్‌ కి వ‌స్తోంది. ఇప్ప‌టికే విదేశాల్లో టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ఇక త‌మిళ‌నాడులో ఈ చిత్రం 100కోట్ల క్ల‌బ్‌ ని తొలి వీకెండ్‌ లోనే అధిగ‌మిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టే భారీ స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. త‌మిళనాడులో 750స్క్రీన్లు - తెలుగు రాష్ట్రాల్లో 1200స్క్రీన్లు ఇప్ప‌టికే లాక్ చేశార‌ట‌. కర్ణాటకలో 700 స్క్రీన్లు - కేరళలో 500 స్క్రీన్ల లో రిలీజ్ కానుంది. త‌మిళ వెర్ష‌న్ నిడివి-2.28 నిమిషాలు - తెలుగు వెర్ష‌న్ 2.29 నిమిషాలు ఫిక్స్ చేశారు. సెన్సార్ ఇప్ప‌టికే యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించింది. ఇక ఈ చిత్రంలో చిట్టీ పాత్ర‌ - క్రోమ్యాన్ పాత్ర‌ల మ‌ధ్య వార్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌ గా ఉంటాయ‌ని - క్లైమాక్స్ 20 నిమిషాలు ఊపేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చివ‌రి 20-30 నిమిషాలు కుర్చీ అంచున కూచుని చూసేలా వీఎఫ్ ఎక్స్ మాయాజాలం క‌ట్టి ప‌డేస్తుంద‌ని తెలిపారు.

2.ఓ త‌మిళ్‌ - తెలుగు రిలీజ్‌ ల‌తో పాటు హిందీ రిలీజ్‌ ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే క‌ర‌ణ్ జోహార్ భారీగానే థియేట‌ర్ల‌ను లాక్ చేశార‌ని తెలుస్తోంది. కిలాడీ అక్ష‌య్ కుమార్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తుండ‌డంతో అక్క‌డా భారీ వ‌సూళ్లు సాధ్య‌మేన‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే త‌మిళం కంటే దాదాపు 450 స్క్రీన్లు అద‌నంగా తెలుగులో ఉన్నాయి. అంటే తొలిరోజు రికార్డులు త‌మిళ‌నాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే బ్రేక్ చేస్తుందా? అన్న‌ది చూడాల్సి ఉంది. దాదాపు 82కోట్లు వెచ్చించి 2.ఓ రైట్స్‌ ని చేజిక్కించుకున్న ఎన్‌ విఆర్ సినిమాస్ దాదాపు 100-150కోట్లు మినిమంగా తెలుగు రాష్ట్రాల నుంచి వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. దాదాపు 530కోట్లు వెచ్చించి ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 29న సినిమా రిలీజ‌వుతోంది.