Begin typing your search above and press return to search.

2.0 రెడీ అవుతోంది.. అది నిజం కాదు

By:  Tupaki Desk   |   16 Dec 2017 6:49 AM GMT
2.0 రెడీ అవుతోంది.. అది నిజం కాదు
X
ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రజినీకాంత్ 2.0 సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు పూర్తయ్యింది అని సంక్రాంతికి రిలీజ్ కాబోతోందని నిర్మాతలు కూడా ప్రకటించారు. కానీ ఎవరు ఊహించని విధంగా మళ్లీ సినిమా వాయిదా పడింది. దీంతో సినిమాపై అనేక రూమర్స్ వచ్చాయి. సినిమా ఈ ఏడాది దీపావళికే రిలీజ్ కావాలి. కానీ శంకర్ ఆలస్యం వల్ల సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందని టాక్ వచ్చింది.

ఇక ఫైనల్ గా సంక్రాంతికి రాబోతోంది అనుకున్న సమయంలో మరొక కారణంతో సినిమా వాయిదా పడింది అనే న్యూస్ చాలా వైరల్ అయ్యింది. సినిమా ఆలస్యం కావడానికి గ్రాఫిక్స్ లెట్ అవ్వడం వల్లే అని గత కొంతలంగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా VFX సంస్థ గ్రాఫిక్స్ పనులను అనుకున్న టైమ్ కి ఫినిష్ చేయకుండా ఆలస్యం చేయడంతో నిర్మాతలు లీగల్ నోటీసులను అందించినట్లు మరో రూమర్ కూడా తెగ హల్ చల్ చేసింది. దాదాపు ఇది అందరు నిజమనే అనుకున్నారు.

కానీ అసలు విషయం అది కాదని రీసెంట్ గా చిత్ర యూనిట్ రూమర్స్ ని కొట్టి పారేసింది. మంచి అవుట్ ఫుట్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ ని ఇంకా బాగా తీర్చిదిద్దుతున్నామని అలాగే గ్రాఫిక్స్ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. దీంతో రూమర్స్ కి కాస్త చెక్ పడినట్లు అయ్యింది. ఫైనల్ గా సమ్మర్ ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి అప్పుడైనా రిలీజ్ చేస్తారో లేక ఇలానే ఎదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తారా?.. చూడాలి.