Begin typing your search above and press return to search.
2018 నవంబరు 29.. 2.0 ఆగమనం
By: Tupaki Desk | 11 July 2018 4:07 AM GMT2.0.. రెండేళ్లుగా భారతీయ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ఇది. కానీ ఆ ఆసక్తిని అంతకంతకూ చంపేస్తూ.. సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లింది చిత్ర బృందం. గత ఏడాది దీపావళికే రావాల్సిన ఈ చిత్రం.. తర్వాత జనవరి 25కి.. ఆపై ఏప్రిల్ కు వాయిదా పడి.. ఆపై విడుదల సంగతే తేలక.. అసలు వార్తల్లోనే లేకుండాపోయింది. ఐతే కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయిన తరుణంలో ఉన్నట్లుండి దర్శకుడు శంకర్ సంచలన ప్రకటన చేశాడు. చడీచప్పుడు లేకుండా ‘2.0’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది నవంబరు 29న గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని శంకర్ ప్రకటించాడు. చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
అందరూ అనుకుంటున్నట్లే విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యమే ‘2.0’ విడుదల ఆలస్యం కావడానికి కారణమని శంకర్ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న స్టూడియో.. ఔట్ పుట్ ఇవ్వడానికి డేట్ ఖరారు చేసిందని.. దీంతో నవంబరు 29న సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నామని శంకర్ వెల్లడించాడు. వీఎఫెక్స్ పనుల ప్రోగ్రెస్ చూసి.. క్వాలిటీ విషయంలో సంతృప్తి చెందాక.. మిగతా పనుల విషయంలోనూ ఒక అంచనాకు వచ్చాక అన్నీ ఆలోచించుకునే శంకర్ రిలీజ్ డేట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. శంకర్ ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ మ్యూజిక్ అందించాడు. లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.