Begin typing your search above and press return to search.

మరో అద్భుత ప్రదేశాన్ని పట్టేసిన శంకర్

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:41 AM GMT
మరో అద్భుత ప్రదేశాన్ని పట్టేసిన శంకర్
X
దర్శకుడు శంకర్ సినిమాలు లార్జర్ థాన్ లైఫ్ వుండడానికి అసలు కారణం అతని ఇమాజినేషన్. జీన్స్ సినిమా మొత్తం చిత్రీకరణ ఒకెత్తయితే 7 వండర్స్ దగ్గర తీసిన ఒక్క పాట మరో ఎత్తు. ఎందుకు కేవలం ఒక్క పాటకే అంత ఖర్చు అని ఒక విలేఖరి ప్రశ్నించగా సాధారణ యువకుడే తన ప్రేమ సఫలమైతే తాజ్ మహల్ ని ఊహించుకుంటాడు మరి నా హీరో 7 వింతల్ని కోరుకోవడం తప్పా అని ఎదురుప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు. అతని పాటల చిత్రీకరణలకు అంతా కొత్తగా వుండాలని కోరుకుంటాడు.

ప్రేమికుడు సినిమాలో గ్లాస్ బస్ సెట్ వేసినా - రోబో మొదటి పాటలో ఎడారి మధ్య పిల్ల కాలువల సోయగాలు చూపినా, కిలిమంజారో అంటూ ఎన్నడూ షూట్ కి అనుమతివ్వని ప్రదేశంలో పాట తీసినా, ఐ సినిమాలో చైనా పూల అందాలని పరిచయం చేసినా అది శంకర్ కే చెల్లింది.

ఇప్పుడు శంకర్ మరోసారి అటువంటి వైవిధ్యమైన ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు సమాచారం. ప్రకృతి అందించిన వరంగా భావించే టన్నెల్ ఆఫ్ లవ్ అనే ప్రదేశంలో రజినీకాంత్ అమీ జాక్సన్ నటిస్తున్న 2.0 షూటింగ్ జరపనున్నారు. ఉక్రెయిన్ లో ఒకానొక రైల్వే స్టేషన్ అయిన ఈ ప్రదేశం కనులకు అద్భుతంగా వుంటుంది. మరి ఈ అద్భుతాన్ని శంకర్ తన కెమెరా కళ్ళతో ఇంకెంత అందంగా చూపిస్తాడో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/