Begin typing your search above and press return to search.
డబ్బింగ్ సినిమాకి 81 కోట్లా?
By: Tupaki Desk | 27 Aug 2017 9:48 AM GMTశంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 2.0. ఏడేళ్ల క్రితం వచ్చిన రోబోకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ.. ఇప్పటివరకూ ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెప్పాలి. 2.0 విడుదలకు ఇంకా 5నెలల సమయం ఉండగా.. ఇప్పటికే ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోతోంది. ఇందుకు కారణం.. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విక్రయిస్తున్న ధరలే.
ఏపీ..తెలంగాణల్లో 2.0 థియేట్రికల్ రైట్స్ ను నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ గతంలోనే విక్రయించేశారు. గ్లోబల్ సినిమాకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ హక్కులు తీసుకోగా.. ఇప్పుడీ మూవీ చేతులు మారిపోయింది. ఏషియన్ ఫిలిమ్స్ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేశారట. అది కూడా ఏకంగా రూ. 81 కోట్లు వెచ్చించి మరీ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏడేళ్ల క్రితం అంటే 2010 రోబో చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ను రూ. 27 కోట్లకు విక్రయిస్తే.. ఇప్పుడీ ఫిగర్ కు కచ్చితంగా 3రెట్లకు కొనుగోలు చేయాల్సి రావడం గమనించాలి. 2.0పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వాస్తవమే అయినా.. ఇది చాలా ఎక్కువ మొత్తం అనాల్సిందే.
ఎందుకంటే.. శాటిలైట్-ఓవర్సీస్ హక్కులు కాకుండా.. కేవలం తెలుగు రాష్ట్రాల వరకే డబ్బింగ్ రైట్స్ 81 కోట్లు అంటే.. ఇండియాలోనే అతి పెద్ద రికార్డ్ గా చెప్పుకోవాలి. ప్రింట్స్ సహా ఇతర ఖర్చులను లెక్కపెట్టుకుంటే.. కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వసూళ్ల రూపంలోనే దాదాపు 85 కోట్ల వరకూ తెస్తేనే ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఇంత మొత్తాన్ని ఇప్పటివరకూ బాహుబలి సిరీస్.. ఖైదీ నంబర్ 150 మినహా.. మరే మూవీ సాధించలేకపోయింది. అంటే 2.0 సేఫ్ ప్రాజెక్ట్ అవాలంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో టాప్3లోకి చేరాల్సిందే.