Begin typing your search above and press return to search.
తలైవర్ 169తో 'రోబో' జంట రిపీట్
By: Tupaki Desk | 10 Jun 2022 4:22 AM GMTఇటీవలి కాలంలో సీనియర్ నాయికలంతా కెరీర్ పరంగా దూసుకెళుతుంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గ్రాఫ్ అనూహ్యంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని వరుస పరాజయాలు ఐష్ కి ఇబ్బందికరంగా మారాయి. ఐష్ షేపవుట్ అవ్వడంపైనా ఇటీవల అభిమానులు హర్టయ్యారు. అయితే ఐష్ మునుపటి ఛామ్ తో తిరిగి రావాలనుకుంటోందట. ప్రస్తుతం తన గురువు మణిరత్నంతో కలిసి భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఆఫర్ తో ఐశ్వర్యారాయ్ సంతృప్తిగా ఉన్నట్టు లేదు. ఇకపైనా సౌత్ లో మెరుపులు మెరిపించాలని కలలు గంటున్నట్టు కనిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ సౌత్ లో మరిన్ని అవకాశాలను వెతుకుతోంది. మణిరత్నం తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ తర్వాత తలైవర్ 169లో 'రోబో' సహనటుడు రజనీకాంత్ సరసన నటించనుందని తెలిసింది.
బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 48 ఏళ్ల ఐశ్వర్యారాయ్ 70 ఏళ్ల సూపర్ స్టార్ కి భార్య పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్లు 12 సంవత్సరాల క్రితం శంకర్ రోబోలో నటించారు.
రజనీ- దిలీప్ కాంబినేషన్ చిత్రంలో రమ్యకృష్ణ- ప్రియాంక అరుల్ మోహన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 2022లో మూవీ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం 2023లో థియేటర్లలోకి రానుంది. ఐశ్వర్యారాయ్ రంగ ప్రవేశం గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
అన్నట్టు ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం సౌత్ రీఎంట్రీ కోసం ఉవ్విళ్లూరుతోంది కాబట్టి ఇకపై ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. నటసింహా నందమూరి బాలకృష్ణ వంటి స్టార్లకు ఓకే చెబుతుందా? అన్నది చూడాలి.
ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తుందని కథనాలొచ్చినా అవేవీ నిజాలు కాలేదు. ఇప్పుడు రజనీతో ఘనంగా రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న ఐష్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతుందేమో వేచి చూడాలి. నాగార్జున సరసన పాతికేళ్ల క్రితమే ఈ బ్యూటీ రావోయి చందమామ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.