Begin typing your search above and press return to search.
హిడెన్ ట్యాలెంట్ కి ఛాన్సిచ్చిన రాక్ స్టార్ దేవీశ్రీ
By: Tupaki Desk | 17 July 2021 7:43 AM GMTవెతికితే కాలికి తగిలిన తీగలా.. చాలా మంది ప్రతిభావంతులైన గాయనీగాయకులు కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా హిడెన్ ట్యాలెంట్ వెలుగు చూడకుండా సరైన అవకాశం ఎలా వెతుక్కోవాలో తెలియని సన్నివేశంలో ఉంటారు. గాలి పాటగాళ్లు బాత్రూమ్ సింగర్లు అనుకుంటాం కానీ.. పిలిచి ఛాన్సిస్తే కొంచెం ఎంకరేజ్ చేసినా సినీ వేదికలపై పాడగలిగే సత్తా ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. కానీ అందరినీ అవకాశం వరించదు. తెలివిగా వెతుక్కునేవారికే అది సాధ్యం.
ఇటీవల మంత్రి కేటీఆర్ .. రాక్ స్టార్ దేవీశ్రీల నడుమ ఓ గమ్మత్తయిన సంభాషణ జరిగింది. తెలంగాణలో హిడెన్ గా దాగి ఉన్న ఒక వర్ధమాన గాయని వీడియోని చూసి దానిని దేవీశ్రీకి ట్యాగ్ చేసి సాయం అడిగారు కేటీఆర్. వెంటనే స్పందించిన దేవీశ్రీ తాను ఎవరో కనుక్కుని సాయం చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఆ ప్రతిభావంతురాలైన గాయని వివరాల్ని సేకరించారు. తమిళంలో చేస్తున్న ఓ సింగింగ్ షోలో సదరు గాయనికి అవకాశం ఇచ్చారు. తద్వారా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కి వెల్లడించగా ఆయన సంతోషించారు.
ఇంతకీ ఎవరీ వర్ధమాన గాయని? అంటే... పేరు శ్రావణి. మెదక్ జిల్లాకి చెందిన యువగాయని.. తను అద్భుతంగా పాడుతోందని దేవీశ్రీ కితాబిచ్చేశారు. చాలా కాలం క్రితం రాణు మోండల్ అనే ఫుట్ పాత్ సింగర్ ని ఇదే విధంగా వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాణు ఓ రైల్వే స్టేషన్ పరిసరాల్లో భిక్షమెత్తుకుని జీవించేవారు. సెలబ్రిటీ కళ్లలో పడ్డాక హిందీ గాయనిగా అద్భుతమైన పాటలు పాడారు.
అభినవ లతామంగేష్కర్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ తనకు పలువురు సెలబ్రిటీలు ఆర్థికంగా సాయం చేశారు. అదే తీరుగా సంగీత దర్శకుడు కోటి కూడా బేబి అనే పల్లెకోకిలను గాయనిగా పరిచయం చేశారు. సింగర్ బేబి గానాలాపానకు మైమరిచి ఏ.ఆర్.రెహమాన్ అంతటి వారే తనని పిలిచి వివరాలడిగారు. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు శాసన సభ్యులు తనను ఆర్థికంగా ఆదుకున్న సంగతి తెలిసిందే.