Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఆలోచనను రేకెత్తించే సినిమా!

By:  Tupaki Desk   |   1 Nov 2018 8:44 AM GMT
టీజర్ టాక్: ఆలోచనను రేకెత్తించే సినిమా!
X
మాధవన్.. మరో దర్శకుడు అనంత మహదేవన్ తో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్'. ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసిన నంబి నారాయణన్ జీవితం లో జరిగిన కొన్ని కీలకమైన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నంబి నారాయణన్ పై గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డట్లు 1994లో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను సీబీఐ 1996లో కొట్టిపారేయగా 1998లో సుప్రీం కోర్టు కూడా ఆయనకు నిర్దోషి అని ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నాడు. అక్టోబర్ 30 నే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'బెటర్ లేట్ దేన్ నెవర్'అంటారు కదా.. లేట్ అయితేనేం మనం టీజర్ గురించి మాట్లాడుకునేందుకు? టీజర్ మొదట్లోనే ఇస్రో విజయంవంతం గా లాంచ్ చేసిన మామ్(మిషన్ టూ మార్స్) రాకెట్ నింగికేగుతూ కనిపించింది. మరోవైపు "నాసా 671 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి 19 సార్లు ప్రయత్నించారు.. . రష్యా 117 మిలియన్లు ఖర్చు చేసి 16 సార్లు ప్రయత్నించారు.. ఇండియా కేవలం 74 మిలియన్లు ఖర్చు చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది అంటూ ఇందులో చూపించారు.

ఇక టీజర్ చివరలో "నా పేరు నంబి నారాయణన్.. నేను 35 సంవత్సరాలు రాకెట్రీలో గడిపాను.. 50 రోజులు జైల్లో గడిపాను. ఆ యాభై రోజుల మూల్యం ఏదైతే నా దేశం చెల్లించిందో దాని గురించి ఈ కథ... నా గురించి కాదు" అని మాధవన్ అంటాడు.

"కొన్ని సార్లు ఒక మనిషికి అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే" అని ఒక క్యాప్షన్ చూపిస్తూ.. "నంబి నారాయణన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం" అని తెలిపారు. ఒక సైంటిస్ట్ జీవితం లో జరిగిన కీలక పరిణామాలు ఆయనకు పర్సనల్ గా జరిగిన నష్టం కంటే కొన్ని వేల లక్షల రెట్లు మనదేశానకి జరగడం అంటే ఇది మనందరం అలోచించాల్సిన విషయమే. టీజర్ మనలో కూడా ఆలోచనను రేకెత్తించేదిగా ఉంది. ఒకసారి మీరు చూడండి..

ఈ సినిమా హిందీ తమిళ తెలుగు భాషలలో రిలీజ్ కానుంది.