Begin typing your search above and press return to search.

టైమ్ మెషీన్ లో వెన‌క్కెళ్లారా బాస్?

By:  Tupaki Desk   |   12 Aug 2019 6:36 AM GMT
టైమ్ మెషీన్ లో వెన‌క్కెళ్లారా బాస్?
X
60 వ‌య‌సు మ‌న్మ‌ధుడిగా కింగ్ నాగార్జున స్టైలిష్ లుక్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈనెల 29తో నాగార్జునకు అర‌వై పూర్త‌వుతున్నాయి. ష‌ష్ఠిపూర్తి వేళ‌.. లేట్ ఏజ్ లోనూ నాగ్ అంత స్టైలిష్ గా ఎలా క‌నిపిస్తారు? అందుకేనా ఆయ‌న న‌వ మ‌న్మ‌ధుడిగా హిస్ట‌రీలో మిగిలిపోయారు అంటూ అక్కినేని అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ లో నాగార్జున గురించే కాదు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి అంతే ఇదిగా ముచ్చ‌టించుకోవ‌డం వేడెక్కిస్తోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు.. సోష‌ల్ మీడియాలో మెగాభిమానుల్లోనూ ప్ర‌స్తుతం ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాస్ చిరంజీవి 60 ప్ల‌స్ ఏజ్ లోనూ అంత స్టైలిష్ గా ఎలా మారుతున్నారు? ఆయ‌నేమైనా అమృతం తాగారా? ఈ ఏజ్ లో ఆ లుక్కేంటి? అంటూ ఒక‌టే తెగ ఇదైపోతున్నారు ఫ్యాన్స్. అన‌గ‌న‌గ ఇంద్రుడు.. అమృతం తాగి నిత్య య‌వ్వ‌నుడు అయ్యారు అన్న‌ట్టుగానే మారిపోతున్నారు. కోడలు ఉపాస‌న నిర్వ‌హిస్తున్న బీపాజిటివ్ మ్యాగజైన్ క‌వ‌ర్ పైనా ఆయ‌న్ని చూసి జ‌నం షాక్ తిన్నారు.

మొన్న ఎస్పీబీ సార‌థ్యంలోని మ్యూజిక్ అవార్డ్స్ వేడుక‌ల్లో చిరంజీవి క‌నిపించిన తీరు చూసాక అభిమానులు మంత్ర ముగ్ధం అయిపోయారు. ఆయ‌న వేదిక‌పైకి ఎంతో స్టైలిష్ గా విచ్చేశారు. ఆ వంగ‌పువ్వు రంగు గ‌ళ్ల చొక్కాలో స‌రికొత్త‌గా క‌నిపించారు. కెరీర్ 152 వ చిత్రం కోసం కొర‌టాల ఇలా మార‌మ‌న్నార‌నే మారుతున్నారా లేక వ‌య‌సుతో ప‌నేం ఉంది మ‌న‌సుండాలే కానీ! అని ప్రూవ్ చేయాల‌నుకుంటున్నారా.. బాస్ స్వ‌యంగా చెప్పాల్సి ఉంటుంది. ఖైదీనంబ‌ర్ 150.. ఘ‌రానా మొగుడు.. గ్యాంగ్ లీడ‌ర్ అంటూ ఇలా టైమ్ మెషీన్ తో ప‌నే లేకుండా కాలాన్ని వెన‌క్కి తిప్పే ప్లాన్ ఏదైనా ఉందా బాస్?