Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఫెయిల్యూర్ తో యశ్ గుండెల్లో రెళ్లు!
By: Tupaki Desk | 4 July 2022 10:02 AM GMTరాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎవరితో చేయాలో? తెలియని సందిగ్ధం పడ్డారు. సీరియస్ గా దర్శకుడు అన్వేషణలో ఉన్నారు. తన రేంజ్ దర్శకుడు ఎవరు? అని రేయింబవళ్లు ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. టాలీవుడ్..కోలీవుడ్ దర్శకుడివైపు దృష్టి సారించినట్లు ఇప్పటికే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. కానీ డైరెక్టర్ ఎంపిక అంత వీజీ కాదు.
మరోవైపు 'కేజీఎఫ్-2' చిత్రీకరణ సమయంలోనే కన్నడ దర్శకుడు నార్తాన్ తో ఓ సినిమా కమిట్ అయినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కథ నచ్చడంతో యశ్ అప్పుడు ఒకే చెప్పినట్లు బలమైన సంకేతాలు అందుతున్నాయి. కానీ అతనికి దర్శకుడిగా ఏమంత? అనుభవం లేదు. 'మప్టీ' అనే ఒకే ఒక్క సినిమా చేసాడు. అది యావరేజ్ గా ఆడింది.
ఇప్పుడు అతని తో ధైర్యంగా ముందుకు వెళ్లాలా? వెనక్కి తగ్గాల్లో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. అందుకు బలమైన కారణం తెరపైకి వస్తోంది. సరిగ్గా ప్రభాస్ గతం లో తీసకున్న ఇలాంటి ఓ నిర్ణయం విమర్శల పాలు చేసిన సంగతి తెలిసిందే. 'బాహుబలి ది కనుక్లూజన్' రిలీజ్ తర్వాత 'సాహో' చిత్రాన్ని సుజిత్ తో చేసిన సంగతి తెలిసిందే. సుజిత్ కి అది రెండవ చిత్రం.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధిచిందో? తెలిసిందో. సుజిత్ అనుభవలేమి తనం అక్కడక్కడా కనిపించింది. అంత పెద్ద స్టార్ సుజిత్ తో రిస్క్ చేయడం పెద్ద తప్పిదని తర్వాత రియలైజ్ అయ్యాడు. సరిగ్గా ఇదే కారణంతో ఇప్పుడు యశ్ -నార్తాన్ తో సినిమా చేయడం ఎంత వరకూ కరెక్ట్? అన్న కోణంలో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. కమిట్ అయిన తర్వాత చేసేదేమీ ఉండదు. మాటకి కట్టుబడాలి. కాబట్టి సినిమా చేయాలి. ఆ తర్వాత త ఫలితం తేడా వస్తే బాధపడాలి. ఇలా కొన్ని కారణాలు యశ్ ని వెనక్కి లాగుతున్నాయి.
ఆ తర్వాత కన్నడలో పేరు మోసిన దర్శకులు ఎవరూ లేరు. అందుకే యశ్ టాలీవుడ్ ..కోలీవుడ్ మేకర్స్ వైపు చూస్తున్నట్లు తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ మేకర్ శంకర్ తెరపైకి వచ్చింది. యశ్-శంకర్ కాంబినేషన్ సెట్ అవుతుందని...నిర్మాణ బాధ్యతలు దిల్ రాజు తీసుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఆర్ సీ 15వ చిత్రానికి శంకర్ దర్ శకత్వం వహించడం...దాన్ని కూడా దిల్ రాజు నిర్మించడంతో ఇది గాలి వార్త అన్న సమాచారం అంతే బలంగా వీస్తోంది.