Begin typing your search above and press return to search.
ఓపిక పట్టండి త్వరలో ప్రకటిస్తున్నా!
By: Tupaki Desk | 9 July 2023 8:00 PM GMTఅభిమానులకు ఓపిక సహనం నశిస్తే అటుపై పరిణామాలు ఎలా ఉంటాయో ఇంతకుముందు పలువురు స్టార్లకు అనుభవం. పవన్ కల్యాణ్- మహేష్- ప్రభాస్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ వంటి స్టార్లకు సోషల్ మీడియాల్లో బెదిరింపులే ఎదురవుతుంటాయి. తమ ఫేవరెట్ హీరో త్వరగా సినిమాని రిలీజ్ చేయాలని ఆత్రపడే అభిమానం ఒక్కోసారి హద్దుమీరుతుంటుంది.
ఇప్పుడు పై జాబితాలో అనూహ్యంగా చేరాడు యష్. కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో అతడి స్టార్ డమ్ అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు దేశంలోని ఫైనెస్ట్ పాన్ ఇండియా హీరోల్లో అతడు ఒకడు. అందుకే కేజీఎఫ్ 2 తర్వాత అతడు ఎలాంటి సినిమాలో నటించబోతున్నాడు? అంటూ ఏడాదిన్నర కాలంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. అభిమానులు ఎంత టెన్షన్ పడుతున్నా కానీ.. యష్ నటించబోయే తదుపరి సినిమాపై ఇదిగో పులి అంటే అదిగో మేక! చందంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి మినహా వాస్తవంగా ఎలాంటి అధికారిక ప్రకటనా రావడం లేదు. 16 నెలలుగా ఇదే పరిస్థితి.
కేజిఎఫ్ 2 విడుదలైనప్పటి నుంచి యష్ నుంచి తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నా ఇంకా ఎటువంటి ప్రకటనా రాకింగ్ స్టార్ చేయలేదు. దీంతో అకస్మాత్తుగా అంది వచ్చిన స్టార్ డమ్ తో ఏం చేయాలో పాలుపోవడం లేదని యష్ ని విమర్శించే ఒక వర్గం కూడా సోషల్ మీడియాల్లో పుట్టుకొచ్చింది. మితిమీరిన అభిమానంతో అతడిని వెంబడిస్తున్న ఫ్యానిజం ప్రమాదకరంగా మారింది.
ఏది ఏమైనా కానీ ఇప్పుడు యష్ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల ఒక కార్యక్రమంలో అతడు తన తదుపరి ప్రాజెక్టు గురించి హింట్ ఇచ్చాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని ఇది ఎంతో ఎగ్జయిట్ చేసే చిత్రం అవుతుందని తన అభిమానులకు హామీ ఇచ్చాడు. ``త్వరలోనే ప్రకటిస్తాను అప్పటివరకూ నాపై నమ్మకం ఉంచండి.. ఓపిగ్గా వేచి చూడండి`` అంటూ ఫ్యాన్స్ ని యష్ సముదాయించాడు. యష్ నుంచి తదుపరి కేజీఎఫ్ 2 ని మించిన సినిమానే అభిమానులు ఆశించేందుకు వీలుంది. అందువల్ల అతడు సరైన స్క్రిప్టు కోసం ఎంతో వేచి చూడాల్సి వస్తోందనేది అర్థమవుతోంది.