Begin typing your search above and press return to search.
ఇదే నా ప్రామిస్ అంటున్న రాక్ స్టార్!
By: Tupaki Desk | 31 May 2019 8:12 AM GMTదేవీ శ్రీ ప్రసాద్ కు ఫ్యాన్స్ ఇచ్చిన టైటిల్ టైటిల్ రాక్ స్టార్. అయన పాటలతో నిజంగానే రాక్ చేస్తాడు. కానీ గత కొంతకాలంగా దేవీ తన స్థాయికి తగ్గట్టు మ్యూజిక్ అందించడంలేదని విమర్శలు వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు లాస్ట్ సినిమా 'మహర్షి' పాటలు అభిమానులనే కాదు.. సాధారణ సంగీత ప్రియులను కూడా నిరాశపరిచాయి. ఒకటి అరా మంచి సాంగ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కొందరు అభిమానులైతే మహేష్ నెక్స్ట్ సినిమాకు దేవీని తీసుకోవద్దని కూడా సోషల్ మీడియాలో మెసేజులు పెట్టారు.
కానీ మహేష్ కొత్త సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీనే ఎంచుకున్నారు. దీంతో తనపై వస్తున్న విమర్శల విషయం డైరెక్ట్ గా ప్రస్తావించకుండా మంచి మ్యూజిక్ అందిస్తానని అభిమానులను చల్లబరించే ప్రయత్నం చేశాడు దేవీ. కానీ 'మహర్షి' ఆల్బమ్ వీక్ అని మాత్రం ఒప్పుకోలేదు. 'సరిలేరు నీకెవ్వరు' లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ "మహర్షి బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మహేష్ అభిమానులు 'అన్నా.. మా మాహేష్ కు మంచి మాస్ పాట కావాలి' అని ప్రత్యేకంగా అడుగుతున్నారు. మహేష్ తో చేసిన గత చిత్రాల కథలను బట్టి ఫుల్ మాస్ సాంగ్స్ చేయడం కుదరలేదు.. కథాపరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య మ్యూజిక్ చేశాను. అయితే ఈ సారి మాత్రం.. పార్టీ అంటే పార్టీ లో కన్ఫాం గా ప్లే చేసుకునే ఒక మాస్ పాటను... లవ్ వస్తే ఈ పాట పెట్టకుండా లవ్ చేయకూడదురా అనే లవ్ సాంగ్ ను చేయాలని డైరెక్టర్ అనిల్ గారు..నేను డిసైడ్ అయ్యాం. మహేష్ గారి ఫ్యాన్స్ అందరికీ నా తరఫునుంచి ఇదే ప్రామిస్" అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు.
దేవీ ఇంత ఓపెన్ గా ఎప్పుడూ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తానని సినిమాకు ముందే ప్రామిస్ చేసింది లేదు. సో.. ఈసారి ఫ్యాన్స్ కాస్త నమ్మకం పెట్టుకోవచ్చన్నమాట. ఈ సినిమాకు కనుక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తే దేవీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే.