Begin typing your search above and press return to search.
బెంగళూరులో కేజీఎఫ్ 2 రాకీభాయ్ ఖరీదైన డూప్లెక్స్ పూజా కార్యక్రమం
By: Tupaki Desk | 2 July 2021 9:39 AM GMTరాకీ భాయ్ అలియాస్ కేజీఎఫ్ స్టార్ యష్ - రాధిక పండిట్ జంట సాధ్యమైనంత తొందర్లోనే తమ కొత్త ఇంట్లోకి మారనున్నారు. నిన్న (జూలై 1) వారి కుటుంబ సభ్యుల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో గృహ ప్రవేశ వేడుక జరిగింది. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే బెంగళూరులోని వారి కొత్త డ్యూప్లెక్స్ ఇంటి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతున్నాయి.
యష్ - రాధిక పండిట్ గృహనిర్మాణ కార్యక్రమంపై కన్నడ చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. యష్ ఛేజిక్కించుకున్నది అత్యంత ఖరీదైన ప్రాపర్టీ అని తెలుస్తోంది. ఈ జంట బెంగళూరులో తమ డ్రీమ్ హౌస్ నిర్మించారు. జూలై- 1 శుభ దినం కావడంతో తక్షణ పూజా కార్యక్రమాలను పూర్తి చేసారు.
వేడుక లో యష్ ప్రకాశవంతమైన నారింజ పట్టు చొక్కా .. ఆఫ్ వైట్ ధోతిని ఎంచుకున్నాడు. రాధిక పండిట్ నారింజ - నీలం పట్టు చీరలో అందంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి యశ్- రాధిక తల్లిదండ్రులు హాజరయ్యారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వారు ఈ వేడుకను చాలా సాధాసీదాగా ముగించారని తెలుస్తోంది.
యష్ సొంతిల్లు ఎంతో అభిరుచితో అందంగా ముస్తాబై కనిపిస్తోంది. ఇంటీరియర్ కోసం రాధిక పండిట్ లావిష్ గానే డిజైన్లను ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. పాలరాతి ఫ్లోరింగ్.. ఫ్రెంచ్ స్టైల్ కిటికీలతో ఇల్లు పూర్తిగా తెలుపు రంగులో పెయింట్ చేయబడిందని అర్థమవుతోంది. ఇంకా ఈ ఇంటికి మరింతగా డెకరేషన్ ని ఈ జంట ప్లాన్ చేసిందట.
ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా మ్యూజిక్ దిగ్గజాలు టి సిరీస్ - లాహరి మ్యూజిక్ సంస్థలు కేజీఎఫ్ 2 ఆడియో హక్కులను కొనుగోలు చేసాయని తెలుస్తోంది.
కేజీఎఫ్-పార్ట్ 1 సంచలన విజయం నేపథ్యంలో పార్ట్ 2 బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. KGF 2 ఆడియో హక్కుల కోసం ఆ రెండు లేబుల్ లు చాలా డబ్బును వెచ్చిస్తున్నాయని తెలిసింది. ఓ ఇన్ సైడ్ సమాచారం మేరకు.. కెజిఎఫ్ చాప్టర్ 2 ఆడియో హక్కులను టి సిరీస్ -లహరి మ్యూజిక్ 72 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాయి. ఇప్పుడున్న క్రైసిస్ లో ఇది నిజంగా చాలా పెద్ద డీల్ అన్న చర్చా సాగుతోంది! KGF 2 థియేట్రికల్ బిజినెస్ సహా శాటిలైట్ డిజిటల్ డీల్ రూపంలోనూ నిర్మాతలు భారీ మొత్తాల్ని కళ్ల జూడనున్నారన్న చర్చా సాగుతోంది. కోలార్ బంగారు గనుల్లో భీకర మాఫియా పోరాటాల్ని పెద్ద తెరపై వీక్షించాలన్న పంతం అభిమానులకు ఉంది. అయితే మహమ్మారీ వల్ల రిలీజ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. సెకండ్ వేవ్ వెళ్లి థియేటర్లు తెరుస్తున్న ఈ శుభతరుణంలో ఇలాంటి పెద్ద సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ విజయంతో పరిశ్రమలో హుషారు పెంచుతుందనే భావిస్తున్నారు.