Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'రోగ్'
By: Tupaki Desk | 31 March 2017 4:52 PM GMTచిత్రం : ‘రోగ్’
నటీనటులు: ఇషాన్ - ఏంజెలా - మన్నారా చోప్రా - అనూప్ సింగ్ ఠాకూర్ - సత్యదేవ్ - ఆలీ - తులసి - సుబ్బరాజు - రాహుల్ సింగ్ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: ముకేష్
నిర్మాతలు: సి.ఆర్.మనోహర్ - సి.ఆర్.గోపి
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పూరి జగన్నాథ్
‘టెంపర్’ మినహాయిస్తే పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లలో తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ‘టెంపర్’ తర్వాత ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు పూరి. ఇప్పుడాయనకు హిట్టు అత్యంత అవసరం. ఇలాంటి టైంలో కన్నడ కుర్రాడు ఇషాన్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘రోగ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చడు పూరి. మరో చంటిగాడి ప్రేమకథ అంటూ ‘ఇడియట్’ను గుర్తుకు చేసిన మరో ఇడియట్ అయ్యిందో లేదో చూద్దాం పదండి.
కథ:
చంటి (ఇషాన్).. అంజలి (ఏంజెలా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తన వల్ల జైలుకు కూడా వెళ్తాడు. కానీ అంజలి తనను మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చంటికి తెలియడంతో అతను అమ్మాయిలపై ధ్వేషం పెంచుకుంటాడు. జైలు నుంచి బయటికి వచ్చాక .. అంతకుముందు అంజలి పెళ్లి ఆపబోయే ప్రయత్నంలో తన వల్ల కాళ్లు కోల్పోయిన కానిస్టేబుల్ (సత్యదేవ్) కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుంటాడు చంటి. ఈ క్రమంలో ఆ కానిస్టేబుల్ చెల్లెలైన అంజలి (మన్నారా చోప్రా) అతడికి దగ్గరవుతుంది. మరోవైపు ఒక సైకో (అనూప్ సింగ్ ఠాకూర్) అంజలిని ప్రేమిస్తాడు. మరి ఆ సైకో నుంచి అంజలిని చంటి ఎలా కాపాడాడు.. ఆమె వల్ల చంటి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
ఇడియట్.. ఓ చంటిగాడి ప్రేమకథ. రోగ్.. మరో చంటిగాడి ప్రేమకథ. ఈ పోలిక చూసి పూరి మళ్లీ ‘ఇడియట్’ లాంటి మంచి ప్రేమకథ తీశాడేమో అనుకుంటాం. కానీ సినిమా చూశాక ఇందులో ప్రేమకథను ఆస్వాదించడం సంగతటుంచితే.. ‘ఇడియట్’ నుంచి ‘రోగ్’ దగ్గరికి వచ్చేసరికి పూరి స్టాండర్డ్స్ ఎలా పడిపోయాయో తెలుస్తుంది. ‘రోగ్’లోని అత్యుత్తమ సన్నివేశం కూడా ‘ఇడియట్’లో చాలా మామూలుగా అనిపించిన సన్నివేశానికి కూడా సాటి రాదంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఈ మధ్య వచ్చిన పూరి స్థాయికి తగని సినిమాల్లో ఇది ముందంజలో ఉంటుంది.
తొలిసారి చూసినపుడు కొత్తగా అనిపించే ఏదైనా విషయం.. పదిసార్లు చూశాక మొహం మొత్తడం ఖాయం. దశాబ్దం కిందట పూరి హీరో క్యారెక్టర్లు చాలా కొత్తగా అనిపించేవి. అప్పటిదాకా మంచితనం మూర్తీభవించిన హీరో పాత్రలకు అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులకు అల్లరి చిల్లరిగా.. బాధ్యతారాహిత్యంగా.. తేడాగా ప్రవర్తించే పూరి హీరో పాత్రలు కొత్తగా కనిపించాయి. ఆ పాత్రలకు బాగా కనెక్టయ్యారు. ఆ సినిమాలన్నీ బాగా ఆడాయి. కానీ ఏ కొత్త విషయమైనా కొన్నాళ్లకు పాతపడిపోవం సహజం. ఆ స్థితిలో దాన్నుంచి బయటపడి.. కొత్త మార్గం చూడటం అవసరం. కానీ పూరి మాత్రం తన మార్కు హీరో క్యారెక్టర్ల హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటికి రాలేదనడానికి తాజా రుజువు ‘రోగ్’.
పూరి గత కొన్నేళ్లలో తీసిన సినిమాలు ఆయన మీద అంచనాల్ని బాగా తగ్గించేశాయి. ఐతే అంత తక్కువ అంచనాలతో చూసినా ‘రోగ్’ నిరాశ పరుస్తుందంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో బాగుంది అనిపించే సన్నివేశం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థీతి. అదేంటో కానీ.. గత కొన్నేళ్ల నుంచి పూరి తీస్తున్న సినిమాలు చూస్తే.. హీరో విపరీతమైన ఫ్రస్టేషన్లో కనిపిస్తాడు. పూరి వ్యక్తిగత జీవితంలో ఏమైందో ఏమో కానీ.. వ్యవస్థను.. అమ్మాయిల్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు అతడి హీరో. ‘రోగ్’ హీరో కూడా అంతే. అతడి లవ్ స్టోరీ తేడా కొట్టిందని అమ్మాయిలందరినీ తిట్టి పోస్టూ.. తన ఫ్రస్టేషన్ అంతా చూపిస్తూ తిరుగుతుంటాడు. ఆ హీరో క్యారెక్టర్ చూస్తుంటే పూరి హీరోయిజం ఎంత పాతబడిందో అర్థమవుతుంది.
ఇక హీరోయిన్ల సంగతి చూద్దామంటే.. ఒకమ్మాయేమో హీరోను గాఢంగా ప్రేమించి.. అన్నయ్య తెచ్చిన సంబంధం నచ్చిందని పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. అదే మాట జైల్లో ఉన్న హీరోకు వచ్చినిర్భయంగా చెబుతుంది. ఇంకో అమ్మాయి హీరో కథంతా తెలిసి కూడా ప్రేమిస్తుంది. కానీ హీరో మాజీ లవర్ తో మూడు రాత్రులు గడిపాడని తెలిసేసరికి పోరా సెకండ్ హ్యాండ్ వాడా అంటూ నదిలో దూకేస్తుంది. మళ్లీ హీరో వచ్చి కాపాడగానే ముందు సీన్లో ఏం జరిగిందో మరిచిపోయి అతడితో రొమాన్స్ చేస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలిలా ఉంటే.. ఇక విలన్ ఒక సైకో. అతడికి హీరోయిన్ని ముద్దు పెట్టుకోవడమే టార్గెట్. దాని కోసం గన్ను పట్టుకుని హీరోయిన్ వెంట తిరుగుతుంటాడు.
ఇలా ఒక్కో పాత్రలో ఒక్కో రకమైన తిక్క కనిపిస్తుంది. ఏ పాత్ర కూడా ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా ఉండదు. ఇక కథాకథనాలైనా ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అంటే అదీ లేదు. పూరి తన పాథ కథల్నే అటు ఇటు మార్చి సినిమా లాగించేసినట్లుగా కనిపిస్తుంది. ‘రోగ్’ ప్రథమార్ధమే విసుగు పుట్టిస్తే.. ద్వితీయార్ధం చూశాక ప్రథమార్ధమే మేలన్న భావన కలిగిస్తుంది. అనూప్ సింగ్ ఠాకూర్ సైకో విలనిజం చాలా సిల్లీగా అనిపించినా.. ఎంటర్టైన్ చేయడం గుడ్డిలో మెల్ల. ‘‘అమ్మాయిలు మేథమేటిక్స్.. అబ్బాయిలు పొయెట్రీ’’.. ఇలాంటి పూరి మార్కు డైలాగులు కూడా కొంత ఎంటర్టైన్ చేస్తాయి. ఇలాంటి డైలాగులు.. కొన్ని సన్నివేశాలు మాస్ ప్రేక్షకుల్ని రోగ్ అక్కడక్కడా అలరిస్తాయి. అంతకుమించి ’రోగ్’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు. ఒకప్పుడు పూరి సినిమాల్లో ఎంతగానో నవ్వించిన ఆలీ కూడా రోగ్‌లో ఏమీ చేయలేకపోయాడంటే అది పూరి వైఫల్యమే. మొత్తంగా పూరి ఏదో అన్యమనస్కంగా.. మొక్కుబడిగా ఈ సినిమాను లాగించేసినట్లు అనిపిస్తుంది.
నటీనటులు:
కొత్త కుర్రాడు ఇషాన్ చూడ్డానికి బాగున్నాడు. అతడికి స్టైలింగ్ అదీ కూడా బాగానే కుదిరాయి. కానీ నటన పరంగా పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమా అంతటా కూడా ఒకే రకమైన హావభావాలతో లాగించాడు. సీరియస్ లుక్స్ తప్ప ఇంకేమీ చూపించలేదు. ఈ మధ్య పూరి హీరోలందరూ ఎలా ఉన్నారో.. ‘రోగ్’లో ఇషాన్ కూడా అలాగే కనిపించాడు. హీరోయిన్లిద్దరిలో ఎవరూ ఆకట్టుకోలేదు. ఇద్దరి లుక్స్ బాగా లేవు. ఇషాన్ పక్కన ఏంజెలా కానీ.. మన్నారా కానీ సూటవ్వలేదు. ఉన్నంతలో మన్నారా కాస్త బెటర్. ఏంజెలా తేలిపోయింది. ఐతే అందాల ప్రదర్శనలో మాత్రం ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ ఒక్కడు అందరిలోకి మెరుగ్గా కనిపించాడు. సైకో పాత్రలో అతను బాగానే చేశాడు. సైకో పాత్ర కావడం వల్ల కొంచెం ఓవరాక్షన్ చేసినట్లు అనిపించినా.. అతడి నటన ఆకట్టుకుంటుంది. సినిమాలో కాస్త ఎంటర్టైన్ చేసేది అతనొక్కడే. సత్యదేవ్.. రాహుల్ సింగ్.. సుబ్బరాజు.. తులసి.. వీళ్లంతా మామూలే. ఆలీ నవ్వించలేకపోయాడు.
సాంకేతికవర్గం:
సునీల్ కశ్యప్ పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం మాత్రం సినిమా లాగే రకరకాలుగా అనిపిస్తుంది. విచిత్రమైన సౌండ్లతో మాటల్లో చెప్పలేని ఫీలింగ్ కలిగించాడు కశ్యప్. ముకేష్ ఛాయాగ్రహణం సినిమాల్లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇషాన్-మన్నారా మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఢోకా లేదు. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో బాగానే ఖర్చుపెట్టినట్లున్నారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ పూరి గురించి ఏం చెప్పాలి.. ఆయన ఒకప్పుడు తీసిన సినిమాల్ని గుర్తు తెచ్చుకుని చింతించడం తప్ప. ‘రోగ్’ విషయంలో ఆయన ఏ రకంగానూ మెప్పించలేదు. ఒక్క రోజులో కథ రాసేస్తా.. రెండు వారాల్లో స్క్రిప్టు పూర్తి చేసేస్తా అని స్టేట్మెంట్లు ఇస్తున్న పూరి.. ఆ కథల్ని ఏమాత్రం మనసు పెట్టి రాస్తున్నారో.. వాటిని ఏమాత్రం శ్రద్ధతో తీస్తున్నారో కూడా చూసుకోవాలి. ‘రోగ్’ లాంటి సినిమాల్ని ఆయన్నుంచి ఎవ్వరూ ఆశించరు.
చివరగా: రోగ్.. ఈ చంటిగాడితో కష్టం బాబోయ్
రేటింగ్ - 1.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre