Begin typing your search above and press return to search.
ఆ సినిమా ఫ్లాప్‌కి కారణం ఎవరు..?
By: Tupaki Desk | 25 July 2016 4:13 AM GMTభారీ బడ్జెట్ - భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ఫ్లాప్ అయిందనుకోండి... ఆ క్రెడిట్ సాధారణంగా అయితే ఎవరి ఖాతాలోకి పడుతుంది? ఆ ప్రాజెక్ట్‌కు కెప్టెన్ దర్శకుడు కాబట్టి - ఫెయిల్యూర్ భారం ఆయనే మోయాల్సి ఉంటుంది. పెద్ద హీరోతో సినిమా తీస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది, స్క్రిప్ట్ మీద ఇంకాస్త కసరత్తు చేసి ఉండాల్సింది, హీరో రేంజిని దృష్టిలో పెట్టుకుని సీన్లు రాసుకుని ఉండాల్సింది అంటూ విశ్లేషణలు చాలానే వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి పంచాయితీ ఒకటి తెరమీదికి వచ్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ - ట్రెండీ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరి కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ చిత్రం పట్టాల మీదకు ఎక్కబోయే స్టేజ్ లో ఉంది. కానీ, ఆ ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోయింది! అదేంటీ.. వీరిది హిట్ కాంబినేషన్ కదా అంటున్నారా! అవును, హిట్ కాంబినేషనే. గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంతో షారుఖ్ - రోహిత్ ల కాంబినేషన్ హిట్ అయింది. అయితే, ఆ తరువాత... అంటే గత ఏడాది దీపావళి సీజన్ లో వీరి కాంబినేషన్ లోనే దిల్ వాలే అనే చిత్రం వచ్చింది. అది డిజాస్టర్! ఆ చిత్రం ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు షారుఖ్ వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.
చెన్నై ఎక్స్ ప్రెస్ హిట్ తరువాత రోహిత్ పై ఎంతో నమ్మకంతో దిల్ వాలే చిత్రానికి అవకాశం ఇచ్చానని షారుఖ్ అంటున్నారు. అవకాశాన్ని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేదనీ, ఆ సినిమా విషయంలో ఏమాత్రం హార్డ్ వర్క్ చేయలేదనీ అందుకే ఆ సినిమా భారీ ఫ్లాప్ అయిందని షారుఖ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలై దర్శకుడు రోహిత్ కూడా స్పందించాడు! దిల్ వాలె ఫ్లాప్ కి కారణం షారుఖ్ మొండిపట్టుదలే అని రోహిత్ అంటున్నాడు. గత ఏడాది దీపావళి సీజన్ లో సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం బాజీరావ్ మస్తానీ కూడా విడుదల అయిందనీ, దాని తరువాత దిల్ వాలె విడుదల చేసుకుందాం అని చెప్పినా షారుఖ్ వినలేదని చెప్పాడు. షారుఖ్ తొందరపెట్టడం వల్లనే దిల్ వాలెను హడావుడిగా పూర్తిచేసి విడుదల చేయాల్సి వచ్చిందన్నాడు. షారుఖ్ తొందరపాటు నిర్ణయం వల్లనే ఆ సినిమా ఫ్లాప్ అయిందని తన వాదనను రోహిత్ వినిపించాడు. సో... మొత్తమ్మీద ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగబోతోందో! ఎందుకంటే, హీరో షారుఖ్ - దర్శకుడు రోహిత్ శెట్టీలు ఇద్దరూ ఆరోపణలకు వెనకడాడటం లేదు.