Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఇంట్లో బ్లాస్టింగ్.. డైరెక్టర్ లింక్

By:  Tupaki Desk   |   28 Sep 2017 9:56 AM GMT
హీరోయిన్ ఇంట్లో బ్లాస్టింగ్.. డైరెక్టర్ లింక్
X
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా బాగా ప్రొఫెషనల్ అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. గోల్ మాల్ ఎగైన్ ట్రైలర్ లాంఛ్ సమయంలో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది కానీ.. అక్కడ బ్లాస్టింగ్ కి సంబంధించిన ఓ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంది.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన గోల్ మాల్ ఎగైన్.. ఈ సిరీస్ లో నాలుగవ భాగం. ఈ చిత్రం ద్వారా పరిణీతి చోప్రా గోల్ మాల్ లో మొదటిసారిగా భాగమైంది. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు అజయ్ దేవగన్.. అర్షాద్ వర్సీ.. శ్రేయాస్ తల్పడే.. కునాల్ ఖేము.. తుషార్ కపూర్.. టబు.. జానీ లీవర్ తో పాటు ఇతర క్రూ అంతా హాజరయ్యారు. వారిలో పరిణీతి చోప్రా కూడా ఉంది. ఓ గ్రీన్ కలర్ గౌన్ వేసుకుని ఈవెంట్ కు హాజరైన పరిణీతి చోప్రా కుడి కాలికి పెద్ద కట్టు కట్టి ఉంది. స్టార్ హీరోయిన్ కాలికి కట్టు అంటే.. ఆటోమేటిగ్గా అందరి దృష్టి అటే వెళ్లిపోతుంది. అదే విషయాన్ని నేరుగా ఆమెనే అడిగితే.. 'రీసెంట్ గా మా ఇంట్లో నా కాలు కింద పడి ఓ గాజు గ్లాసు బద్దలైపోయింది. అప్పుడు తగిలిన దెబ్బ కారణంగా నాకు కుట్లు కూడా పడ్డాయి' అని చెప్పింది పరిణీతి.

అయితే.. తన సినిమాల్లో రకరకాల పేలుళ్లతో హంగామా చేసేయడం దర్శకుడు రోహిత్ శెట్టికి అలవాటు అని మనకు తెలుసు. అందుకే పరిణీతి చెప్పిన వెంటనే.. "ఆ గ్లాస్ పేలుడుకి నాకు సంబంధం లేదు" అనేయడంతో అక్కడంతా నవ్వులు పూశాయి. ఆ సంగతేమో కానీ.. కాలికి కుట్లు కూడా వేయించుకున్న పరిస్థితిలో.. మూవీ ప్రచారానికి అలాగే అటెండ్ అయిందంటే.. పరిణీతి చోప్రా డెడికేషన్ ను ప్రశంసించాల్సిందే.