Begin typing your search above and press return to search.
బన్నిని కాపీ కొట్టిన 8 సెంచరీల డైరెక్టర్
By: Tupaki Desk | 16 March 2019 6:55 AM GMTఏది కమర్షియల్ సినిమా ..? కమర్షియల్ మూవీ ప్రాథమిక లక్షణాలేంటి? ఈ విషయంలో ఇప్పటికే బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకనిర్మాతల్లోనే బోలెడన్ని సందేహాలున్నాయి. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవుతుంది? దానికి కొలమాణాలేంటి? అన్నదానిపై తర్జనభర్జన పడుతుంటారు. బాస్ అల్లు అరవింద్ - దిల్ రాజు అంతటివారే ఈ విషయంలో తడబడుతున్న సన్నివేశం ప్రతిసారీ బయటపడుతోంది.
ఇలాంటి సన్నివేశంలో కమర్షియల్ సినిమా వాసన పట్టేసి, సౌత్ సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్న ప్రఖ్యాత దర్శకుడు రోహిత్ శెట్టిని ఇదే విషయమై ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఫక్తు మాస్ మసాలా యాక్షన్ కామెడీలు తీస్తూ హిట్టు కొడుతున్న రోహిత్ శెట్టి ఆ రహస్యంపై పెదవి విప్పారు. అందుకోసం ఏకంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరును ప్రస్థావించడం ఆసక్తికరం. అసలు జనాల అభిరుచి ఎలా ఉంది? మాస్ ని ఆకట్టుకోవడం ఎలా అన్నదానికి బన్ని వినిపించే వాదనను ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకోవడం ఆసక్తికరం.
సౌత్ స్టార్ అల్లు అర్జున్ నటించే సినిమాలకు మిశ్రమ స్పందనలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తుంటాయి. ఏ కంటెంట్ అభిమానుల్ని మెప్పిస్తుంది? అన్నది స్టార్లకు తెలుస్తుంది. అభిమానుల్ని సంతుష్టుల్ని చేయడమే సక్సస్ సీక్రెట్!! అని రోహిత్ శెట్టి అన్నారు. రోహిత్ పక్కా మసాలా దర్శకుడు అని కరణ్ జోహార్ లాంటి దర్శకులు వ్యాఖ్యానించినా దాని వెనక ఉన్న ఫార్ములా ఏంటో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. వరుస పెట్టి ఎనిమిది 100 కోట్ల క్లబ్ సినిమాల్ని తెరకెక్కించిన గ్రేట్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఇటీవలే `సింబా` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ - అల్లు అర్జున్ ఫార్ములాని రోహిత్ శెట్టి తెలివిగా కాపీ కొట్టాడనే దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
బన్ని ప్రస్తుతం ఏఏ19 - ఏఏ 20 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కంటెంట్ రోహిత్ శెట్టి ఫార్ములాతోనే ఉంటాయా? అంటే ఒకటి త్రివిక్రమ్ శైలి కామిక్ టైమింగ్ తో ఉండే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయితే ఇంకొకంటి సుకుమార్ తరహా లాజిక్కులు - జిమ్మిక్కుల స్క్రీన్ ప్లేతో ఉండే మైండ్ ప్లే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ఈ రెండు సినిమాల గురించి అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8న క్లారిటీ వస్తుందేమో చూడాలి.