Begin typing your search above and press return to search.
మావాళ్లకు చెప్పి ఓకే అన్న తర్వాత నాకు ఐ లవ్ యూ చెప్పాడు : రోజా
By: Tupaki Desk | 9 Nov 2020 12:30 AM GMTతమిళ దర్శకుడు అయిన సెల్వమణికి తెలుగు హీరోయిన్ అయిన రోజాకు ఎలా జత కలిసింది.. ఇద్దరికి పెళ్లి ఎలా అయ్యి ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న అనుమానం. వీరిద్దరిది కూడా ప్రేమ విషయం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా జబర్దస్త్ లో రోనా తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. రోజా సెల్వమణిల ప్రేమ పై బుల్లెట్ భాస్కర్ టీం స్కిట్ చేస్తున్న సమయంలో రోజా ఇలా మా ప్రేమ కథ ఉండదు. సెల్వమణి డైరెక్ట్ గా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. నన్ను ప్రేమించిన ఆయన మొదట వెళ్లి మా ఇంట్లో వారికి చెప్పాడు. వారిని ఒప్పించిన తర్వాత వచ్చి నాకు ఐలవ్ యూ చెప్పాడు.
నేను సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు నా వద్దకు వచ్చి ఐలవ్ యూ మన పెళ్లికి మీ ఇంట్లో వారు ఒప్పుకున్నారు అంటూ చెప్పారు అంటూ రోజా తన పాత రోజుల ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే అయిన రోజా హైదరాబాద్.. చిత్తూరు తిరుగుతూ ఉన్నా కూడా ఆయన చెన్నైలో ఉంటున్నా కూడా సందర్బం వచ్చినప్పుడు కుటుంబం అంతా చాలా సంతోషంగా గడిపేందుకు తప్పకుండా కలుస్తూనే ఉంటారు. రోజా భర్త అయిన సెల్వమణి తమిళ దర్శకుల సంఘంలో కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా సౌత్ సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.