Begin typing your search above and press return to search.

కూతురు సినీ ఎంట్రీపై రోజా క్లారిటీ

By:  Tupaki Desk   |   17 Nov 2022 9:47 AM GMT
కూతురు సినీ ఎంట్రీపై రోజా క్లారిటీ
X
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. తన కూతురు, కుమారుడి సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోజాతోపాటు శ్రీవారి దర్శనం చేసుకున్న వారిలో ఆమె సన్నిహితులు, జబర్ధస్త్ వర్ష, ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల రావడం.. తన పుట్టినరోజు సందర్భంగా స్వామి వారి ఆశీససులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తాను తిరుపతి ప్రాంతంలో పుట్టడం.. రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు రోజా తెలిపారు. శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని స్వామివారిని కోరుకున్నట్టు మంత్రి రోజా తెలిపారు.

ఈ సందర్భంగా రోజా తన కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.యాక్టింగ్ చేయడం తప్పని తాను ఎప్పుడూ అనను అని రోజా చెప్పారు. తన కొడుకు, కూతురు యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే తాను సంతోషంగా ఫీల్ అవుతానని తెలిపారు.

తన కూతురికి చదువుకోవాలని.. సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన ఉందని తెలిపారు. తన కూతురు ప్రస్తుతం బాగా చదువుతోందని.. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, హీరోయిన్ గా తన ఆశీస్సులు ఉంటాయని తెలిపారు.

రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అన్షు ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం. ఒక రచయితగా.. ఎంటర్ ప్రెన్యూనర్ గా, ప్రోగ్రామర్ గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఆమె ఎంపికైనట్లు ఇన్ఫ్ల ఎన్సర్ సంస్థ ప్రకటించింది. కాగా బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫొటో వేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణికి అన్షు మల్లికా, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా రాణిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.