Begin typing your search above and press return to search.

బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్-రోజా

By:  Tupaki Desk   |   31 Oct 2016 7:38 AM GMT
బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్-రోజా
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన రోజా ఏంటి.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలయ్యతో దీపావళి స్పెషల్ అని చెప్పడమేంటి అనుకుంటున్నారా? ఇది ఈ రోజుల్లో సంగతి కాదులెండి. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ రోజా ఈ వ్యాఖ్యలు చేసింది. దీపావళి పండగ తనకు చాలా స్పెషల్ అని.. అందులోనూ బాలయ్యతో కలిసి ఒకప్పుడు చేసుకున్న దీపావళి వేడుకల్ని మరిచిపోలేనని రోజా చెప్పింది.

‘‘నాకు భక్తి ఎక్కువ. దేవుడన్నా.. పండుగలన్నా చాలా ఇష్టం. మా పిల్లలకు దీపావళి అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మా అన్నయ్య పిల్లలు కూడా మా ఇంటికే వస్తారు. ఈసారి కూడా వచ్చారు. అందరం కలిసి మా ఇంట్లోనే దీపావళి జరుపుకుంటాం. నేను ఎంత పెద్ద హీరోయిన్‌ అయినప్పటికీ పండుగ అంటే కొత్త బట్టలు.. టపాసులు.. మిఠాయిలు.. సినిమాలు అన్నీ ఉండాల్సిందే. ఈ రోజు పిల్లలతో కలిసి ‘ఇజం’ సినిమాకు వెళ్లాం. ప్రతి దీపావళీ నాకు ఎన్నో మంచి అనుభూతుల్ని వదిలి వెళ్తుంటుంది. ఒకప్పుడు ‘పెద్దన్నయ్య’ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుండగా.. నేను.. బాలకృష్ణగారితో పాటు యూనిట్ సభ్యులందరం కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నాం. ఆ దీపావళి నాకు ఎక్కువ ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. నేను దేవుణ్ని కోరుకునేది ఒక్కటే.. నాతో పాటు అందరూ బాగుండాలి. నావల్ల పదిమందికి మంచి జరగాలి’’ అని రోజా చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/