Begin typing your search above and press return to search.
రంగస్థలం చిట్టిబాబులా పుష్పరాజ్ కి ఒక లోపం!
By: Tupaki Desk | 24 Aug 2021 7:30 AM GMTవిలేజీ మాస్ బోయ్ గానో.. అడవిలో గంధపు చెక్కల దొంగగానో లేదా టెంపర్ మెంట్ ఉన్న పోలీసోడిగానో నటించాలంటే అంత సులువేమీ కాదు. కానీ ఇలాంటి అవకాశాలు వస్తే ఇరగదీస్తామని నిరూపిస్తున్నారు మన హీరోలు. రామ్ చరణ్ .. ఎన్టీఆర్.. బన్ని లాంటి స్టార్లు వేషం ఎలాంటిదైనా అదరగొడుతున్నారు.
ఇంతకుముందు రంగస్థలం చిత్రంలో సిట్టిబాబుగా చరణ్ ఆహార్యం పై క్రిటిక్స్ సహా ప్రేక్షకాభిమానుల ప్రశంసలు కురిసాయి. చెవిటివాడిగా నిక్కరుపై పంచెకట్టే మాస్ గోదారి కుర్రాడిగా చరణ్ నటనకు జేజేలు పలికారు. అలాగే అవినీతి పరుడైన టెంపర్ మెంట్ ఉన్న పోలీసోడిగా నటించిన తారక్ కి అంతే బ్రహ్మరథం పట్టారు. టెంపర్ సినిమాలో చెడ్డవాడైన పోలీస్ కాస్త ఒక ఘటనతో చివరికి మంచివాడిగా పరివర్తన చెందే ఎన్టీఆర్ నటన మైమరిపిస్తుంది.
ఇప్పుడు అంతకుమించి సవాల్ ని బన్ని స్వీకరించాడు. అదే పుష్పరాజ్ పాత్ర. అడవిలో గంధపు చెక్కలను దొంగిలించడం అంటే ఆషామాషీనా? చెక్ పోస్టుల్ని దాటుకుని వెళ్లాలి. భయంకరమైన ఎదురు దాడుల్ని తట్టుకోవాలి. అలాంటప్పుడు ఛేజింగులు భీకరమైన యాక్షన్ తో గాయాలు తప్పనిసరి. కాలు విరగడం భుజానికి గాయం అవ్వడం.. తుంటి జారిపోవడం లాంటివి ఉంటాయి. మరి అలా దెబ్బ తిన్న కుర్రాడి ఆహార్యం ఎలా ఉంటుందో ఒకసారి బన్నీని చూస్తే కానీ తెలీదు. తుంటికి దెబ్బ తగిలి లేదా భుజానికి గాయమై ఒక చెయ్యి పడిపోయి క్లిష్ఠమైన సన్నివేశం లో ఎలా నటించాలి? అన్నది కూడా ఆహార్యంలో చూపించాలి. ఆశ్చర్యకరంగా ఇంతకుముందు పుష్ప టీజర్ లో ఒక చెయ్యి కదల్చలేని ఒకవైపు కాస్త వొంగి నడిచేవాడిగా కనిపించి ఆ ఆహార్యం కోసం కష్టపడిన బన్నీని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. అది భుజానికి తగిలిన గాయం వల్ల ఆ ఛేంజ్ అని ఆ పాత్రకు ఆపాదించిన తీరు అద్భుతం అని టాక్ వినిపిస్తోంది.
అభిమానులందరినీ విస్మయానికి గురిచేసే పుష్ప కొత్త లుక్ మరోసారి లీకైంది. పొడవాటి గిరజాల జుట్టు పక్కపాపిడితో గుబురుగడ్డం మీసకట్టుతో కనిపిస్తున్నాడు. స్తంభింపచేసిన భుజాన్ని కదపడమెలా.. అన్నది దాక్కో దాక్కో మేకా పాట ప్రోమోలో ఆ కష్టం కనిపించింది బన్నీలో. అచ్చంగా గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలోకి ఒదిగిపోయేందుకు అల్లు అర్జున్ ఎంతగానో శ్రమిస్తున్నారు. అలా ఎడమ భుజాన్ని పెద్ద గా కదపకుండా.. ఎడమ చేతిని ఉపయోగిస్తూ పనులు నడిపించాలి. దానికి గంటల తరబడి ప్రాక్టీస్ కూడా చేశాడట. ప్రతిరోజూ గంటల తరబడి ఆ చేతి కదలికను ప్రాక్టీస్ చేసిన తర్వాత తన పాత్రలోకి ప్రవేశించాడట బన్ని. మానసిక నిపుణులు ఫిట్ నెస్ సలహాదారుల సహాయాన్ని తీసుకొని అల్లు అర్జున్ ప్రతిరోజూ పుష్పరాజ్ గా మారేందుకు ఎంతో శ్రమించారు. ఇంకా అదే పాత్ర అదే ఆహార్యంతో తాజా షెడ్యూల్ లో నటించాల్సి ఉంది.
దేనికైనా ప్రాణం పెట్టి పని చేయాలి. అందుకు బన్ని ఏమాత్రం వెనకాడడు. అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప డ్యూయాలజీతో పాన్ ఇండియా హిట్లు కొట్టాలని కలలుగంటున్నాడు. సుకుమార్ లాంటి ట్యాలెంటెడ్ దర్శకుడితో అతడి ప్రయాణం బిగ్ టర్న్ తీసుకుంటుందనే భావిస్తున్నారు. తన సినిమాల్లో పాత్రలను చూపిస్తూ ఆ పాత్రలకు లోపాల్ని ఆపాదించి అందులోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సుకుమార్ చేస్తున్న ప్రయోగాలు మామూలుగా లేవు. ఇప్పుడు బన్ని ఆహార్యం మరోసారి రంగస్థలం చిట్టిబాబులా హాట్ టాపిక్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.