Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పూరి స్కూల్ రొమాన్స్!

By:  Tupaki Desk   |   20 Dec 2019 9:16 AM GMT
ఫోటో స్టోరీ: పూరి స్కూల్ రొమాన్స్!
X
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా 'ఆంధ్రాపోరి'.. 'మెహబూబా' సినిమాల్లో నటించాడు కానీ అవేమీ హిట్ ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఆకాశ్ 'రొమాంటిక్' అనే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఇతర పోస్టర్లతో హీట్ పెంచిన 'రొమాంటిక్' టీమ్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా నుంచి 'నువ్వు నేను ఈ క్షణం' అనే పాటను డిసెంబర్ 21 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది 'రొమాంటిక్' టీమ్. సినిమా టైటిల్ కు తగ్గట్టే ఈ పోస్టర్ కూడా రొమాంటిక్ గా ఉంది. ఆకాశ్ ఒక రెయిలింగ్ ను పట్టుకుని నిలుచున్నాడు. హీరోయిన్ కేతిక శర్మ వెనుకనుంచి గట్టిగా కౌగలించుకుంది. పోస్టర్ కింద వైపు.. ఒక మద్యం సీసా కూడా మసకగా కనిపిస్తోంది. అంటే బోల్డ్ రొమాన్స్ అని మనం ఫిక్స్ అయిపోవాలి.

ఈ సినిమాతో అనిల్ మదురై దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. కథ మాత్రం పూరి అందించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్ - ఛార్మీ ఈ సినిమా పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్.. పూరి కనెక్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.